యాంకర్ వర్షిణి సుందరరాజన్ భోళా శంకర్ సెట్స్ లో కనిపించారు. ఆమె మెగాస్టార్ చిరంజీవితో ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫోటో వైరల్ కాగా భోళా శంకర్ లో వర్షిణి నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
భోళా శంకర్ షూట్ చివరి దశకు చేరుకుంది. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ ల మీద ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. పెళ్ళి సంగీత్ కి సంబంధించిన సాంగ్ అని తెలుస్తుంది. భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు. అక్కినేని హీరో సుశాంత్ ఆమెకు జంటగా నటిస్తున్నారు. చిరంజీవి లీక్ చేసిన వీడియోలో సుశాంత్ ని కూడా మనం చూడొచ్చు.
కాగా భోళా శంకర్ సెట్స్ లో యాంకర్ వర్షిణి సుందరరాజన్ ప్రత్యక్షమైంది. చిరంజీవితో పాటు ఫోటో దిగారు. సదరు మెమరబుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి లవ్ సింబల్ జోడించారు. అయితే భోళా శంకర్ సెట్స్ కి వర్షిణి వెళ్లడంతో ఆమె చిత్రంలో నటిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భోళా శంకర్ మూవీలో శ్రీముఖి నటిస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం అవుతుంది. చిరంజీవి-శ్రీముఖి మీద ఖుషి మూవీలోని భూమిక నడుము పవన్ కళ్యాణ్ చూసే సీన్ ని స్పూఫ్ చేశారని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేదు. ప్రచారంలో ఉంది. లేటెస్ట్ గా వర్షిణి కనిపించిన నేపథ్యంలో శ్రీముఖికి బదులు ఆ పాత్ర వర్షిణి చేస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇటీవల వర్షిణి శాకుంతలం మూవీలో నటించారు. ఆమె ఓ చిత్ర పాత్రలో తళుక్కున మెరిశారు. బుల్లితెర మీద వర్షిణి సందడి తగ్గింది. కెరీర్ బిగినింగ్ లో వర్షిణి హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేశారు. యాంకర్ గా కూడా ఆమెకు బ్రేక్ రాలేదు. స్టార్స్ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తున్నారు.
