సుమ ఫ్రీగా ఈవెంట్ చేసిన విషయం బయటకి రావడం ఆమెకు ఇష్టం లేదని అర్థమైంది. ఈ కారణంగా సుమ వద్ద డబ్బులు బాగా ఉన్నాయి, కాబట్టి ఫ్రీగా ఈవెంట్స్ చేస్తుందని జనాలు అపార్థం చేసుకోవచ్చు.
యాంకరింగ్ లో సుమ (Anchor Suma) సూపర్ స్టార్. ఆ ఫీల్డ్ లో ఆమెను కొట్టినోళ్లు లేరు. రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెరపై మహారాణిలా కొనసాగుతున్నారు. మరి సుమకు ఉన్న డిమాండ్ రీత్యా ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. ఓ స్టార్ హీరో ఈవెంట్ కి ఆమె లక్షల్లో ఛార్జ్ చేస్తారు. రెండు మూడు గంటల ఈవెంట్ కి అంత మొత్తం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక ఒంటినిండా హ్యూమర్ కలిగిన సుమ ఎదుటివారు మాటలకు అనుగుణంగా టైమింగ్ సెటైర్లు వేసింది .
తాజాగా ఆమె గుడ్ లక్ సఖి (Good luck Sakhi) ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి చిత్రంలో జగపతిబాబు,ఆది పినిశెట్టి కీలక రోల్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సహనిర్మాత శ్రావ్య వర్మ మాట్లాడుతూ... యాంకర్ సుమ ఈవెంట్ కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా మా సినిమాకు సప్పోర్ట్ చేస్తున్నారని వేదికపై చెప్పారు. డబ్బులు తీసుకోకుండా ఈవెంట్ చేస్తున్న విషయం శ్రావ్య వర్మ పబ్లిక్ గా బయట పెట్టడంతో సుమ కంగారు పడ్డారు. మధ్యలో కల్పించుకుంటూ.. వదిలితే నా మొత్తం ఆస్తుల వివరాలు కూడా చెప్పలేదు ఉన్నావు. నెక్స్ట్ చిత్రాలకు వసూలు చేస్తాలే అంటూ టైమింగ్ డైలాగ్ కొట్టింది.
సుమ ఫ్రీగా ఈవెంట్ చేసిన విషయం బయటకి రావడం ఆమెకు ఇష్టం లేదని అర్థమైంది. ఈ కారణంగా సుమ వద్ద డబ్బులు బాగా ఉన్నాయి, కాబట్టి ఫ్రీగా ఈవెంట్స్ చేస్తుందని జనాలు అపార్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని చిన్న చిత్రాల నిర్మాతలు తమకు కూడా ఫ్రీగా ఈవెంట్ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు. ఈ భయంతోనే సుమ అలా కంగారు పడి ఉండవచ్చు.
నిజానికి ఓ స్టార్ హీరోయిన్ కి మించిన సంపాదన సుమ సొంతం. ఏళ్లుగా తీరికలేని యాంకర్ గా ఉన్న సుమ భారీగా ఆర్జించారు అనడంలో సందేహం లేదు. ఇక ఆమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే మూవీ తెరకెక్కింది. పల్లెటూరి మహిళ గెటప్ లో సుమ అలరించగా... విడుదలకు సిద్ధం అవుతోంది. కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు చిత్రాలు హీరోయిన్ గా చేసిన తర్వాత యాంకర్ గా మారారు.
మరోవైపు గుడ్ లక్ సఖి జనవరి 28న విడుదల కానుంది. నగేష్ కుకునూర్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (Ram charan)సందడి చేశారు. చిరంజీవి హాజరు కావాల్సి ఉండగా... ఆయనకు కరోనా నేపథ్యంలో చరణ్ హాజరయ్యారు. ఇక కీర్తి సరైన విజయం అందుకోయ్ చాలా రోజులు అవుతుంది. మహానటి తర్వాత ఆమెకు ఆ స్థాయి హిట్ దక్కలేదు.
