ఆదివారం రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రీరిలీజ్ వేడుకలో సుమ, బ్రహ్మాజీ మధ్య జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 

బ్రహ్మాజీ ప్రసంగించేందుకు వేదికపైకి రాగానే హాయ్ అక్కా అని సుమని పలకరించాడు. ఏమిటి అక్క.. మీరు ఎన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారో మాకు తెలుసు అని సుమ సరదాగా కామెంట్ చేసింది. దీనితో బ్రహ్మాజీ ఎందుకులే ఆ టాపిక్ ఇప్పుడు అని రిప్లై ఇచ్చాడు. బహుశా బ్రహ్మాజీ గారి వయసు 116 రి ఉంటుంది.. 1116 కూడా కావచ్చు అని కామెంట్ చేసింది. 

బ్రహ్మాజీ ఈ చిత్రంలో నటన నేర్పించే టీచర్ పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో 'ఐ యామ్ నాట్ డన్ ఎట్' అంటూ బ్రహ్మాజీ ఫన్నీగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.