అత్యంత ఆదరణ కలిగిన బుల్లితెర షోలలో క్యాష్ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా ఉన్న ఈ షోలో సెలెబ్రిటీలు పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో యాంకర్ రవి, జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్, యాంకర్ వర్షిణి మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను పాల్గొన్నారు. ఆ నలుగురు మదర్స్ కూడా ఈ షోలో వారితో కలిసి పాల్గొనడం విశేషం. 

క్యాష్ ప్రోగ్రాం లో యాంకర్ రవి మరియు సుమ ఒకరిపై ఒకరు వేసుకున్న పంచ్ లో ప్రేక్షకులకు సరదా పంచాయి. సుమ ఏజ్ పై రవి సెటైర్స్ బాగా పేలాయి. ఇక ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న నలుగురిని సుమ కొన్ని ఇరుకునపెట్టే ప్రశ్నలు అడిగారు. వర్షిణిని  సుమ నీ అందంతో పోల్చితే వీరిద్దరిలో ఎవరు పనికిరారు? అని నువ్వు భావిస్తున్నావ్ అని సుమ అడిగారు. దానికి ఏమి చెప్పాలో వర్షిణి అర్థం కాలేదు. 

ఇక బిగ్ బాస్ ఫేమ్ భానును ఈ రెండింటిలో మీకు సూటు కానిది ఏది? యాంకరింగ్ అండ్ అమ్మాయిగా పుట్టడం అని అడుగగా రెండూ అంటూ భాను షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ గేమ్ లో యాంకర్ రవిని సుమ వీరిద్దరిలో ఎవరితో యాంకరింగ్ చేసి తప్పు చేశానని భావిస్తున్నారు, అడిగారు. ఈ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో రవికి అర్థం కాలేదు. ఐతే సుమ ప్రశ్నలో ఉన్న ఆ ఇద్దరు యాంకర్స్ ఎవరనే విషయంలో ప్రోమోలో చూపించలేదు. సెప్టెంబర్ 7న ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ లో దీనిపై స్పష్టత రానుంది.