Asianet News TeluguAsianet News Telugu

మొదటిసారి కొడుకు ఫోటోని ఫ్యాన్స్ తో పంచుకున్న యాంకర్ సమీరా!

అక్టోబర్ 11న సమీర మగబిగ్గను కన్నారు. ఆ బాలుడికి సయ్యద్ అర్హాన్ అని నామకరణం చేయడం జరిగింది.

anchor sameera introduces newly born child to fans
Author
Hyderabad, First Published Oct 18, 2021, 7:40 PM IST


యాంకర్ సమీర తన బిడ్డను మొదటిసారి అభిమానులకు పరిచయం చేశారు. తన ఆనందం అందరితో పంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఇటీవల జన్మించిన పసికందు, భర్తతో ఫోటోలకు ఫోజిచ్చారు. అక్టోబర్ 11న సమీర మగబిగ్గను కన్నారు. ఆ బాలుడికి సయ్యద్ అర్హాన్ అని నామకరణం చేయడం జరిగింది.సమీరా కొడుకు syed arhaan ని చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న తరుణంలో పసివాడి ఫోటోను రివీల్ చేశారు. 


'మా ఆనందాలకు చిరునామా..మా బేబీ సయ్యద్ అర్హాన్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను ఎదుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. నా మేనకోడళ్లు, అల్లుళ్లు, ఫ్రెండ్స్‌ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను.ఇప్పుడు నా కన్నబిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం అయిన దేవుడికి ధన్యవాదాలు. థ్యాంక్యూ అర్హాన్‌..మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలక్ట్‌ చేసుకున్నందుకు. నీకు బెస్ట్‌ మథర్‌గానే కాకుండా, బెస్ట్‌ ఫ్రెండ్‌గా కూడా ఉంటానని మాటిస్తున్నాను' అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ను పంచుకుంది. 

Also read వైద్యం కోసం వెళితే అసభ్యంగా తాకిన డాక్టర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్

ఇక Sameera బిడ్డను చూసిన అభిమానులు, బుల్లితెర సెలెబ్రిటీలు బేస్ విషెష్ తెలియజేస్తున్నారు. బాబు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సమీరా కుమారుడు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. గతంలో ఓ అబ్బాయికి సమీరా జన్మనిచ్చారు. సయ్యద్ అర్హాన్ సమీరా దంపతులకు రెండవ సంతానం అని సమాచారం. 

Also read జబ్బలు జాకెట్ లో సూపర్ హాట్ గా ఢీ పూర్ణ... కట్టింది శారీ అయితేనేమీ ఆ సిట్టింగ్ యాంగిల్ చూస్తే మైండ్ బ్లాకే!
2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు అదిరింది షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. Adirindi షోకి యాంకర్ గా సమీరా చేయడం జరిగింది. ప్రస్తుతం సీరియల్స్‌కు బ్రేక్‌ ఇచ్చి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌తో ఎంతోమంది ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios