‘మరో ఆత్మహత్య కోసం ఎదురుచూస్తున్నారా?’.. నాగశౌర్య వైరల్ వీడియోపై స్పందించిన రష్మీ గౌతమ్!

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి  షాకింగ్ కామెంట్స్ చేశారు. నెట్టింట వైరల్ గా యంగ్ హీరో నాగశౌర్య వీడియోపై స్పందించింది. నెటిజన్లు అలా కామెంట్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. 
 

Anchor Rashmi Gautam responded on naga shauryas viral video

స్టార్ యాంకర్ రష్మీగౌతమ్ (Rashmi Gautam) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  కేరీర్ లో దూసుకెళ్తున్న ఆమె సోషల్ అంశాలపైనా స్పందిస్తుంటారు. రీసెంట్ గా ‘అంబర్ పేట కుక్కల దాడి’పైనా స్పందిస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు నెటిజన్ల నుంచి భారీ విమర్శలను అందుకుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న  నాగశౌర్య (Naga Shaurya) వీడియోపైనా స్పందించారు. ఓ ప్రేమికుడు తన గర్ల్ ఫ్రెండ్ పే చేయిచేసుకున్న సందర్భాన్ని నాగశౌర్య నిలదీయడాన్ని కొందరు నెటిజన్లు విమర్శిస్తూ  కామెంట్లు పెట్టారు.  దీంతో వారి తీరును తప్పుబట్టారు. 

కొందరి నెటిజన్ల కామెంట్లను స్కీన్ షార్ట్ తీసి మరీ ట్వీటర్ వేదికన మండిపడింది. ‘వాడి లవర్ వాడి ఇష్టమంటూ.. అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు పెట్టడం సిగ్గుచేటు. ఆ అమ్మాయికి ఎంత ఒత్తిడి ఉందో ఎవరికి తెలుసు. మీరు నిజంగానే మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?’ అంటూ మండిపడ్డింది. కేఎంసీ విద్యార్థిని ఆత్మహత్యను పరోక్షంగా గుర్తుచూస్తూ  నెటిజన్లు చేసిన అభిప్రాయాలను వ్యతిరేకించింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కామెంట్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక నిన్న (మంగళవారం) హైదరాబాద్ లో ని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువకుడు యువతీ చెంపపై కొట్టడంపై నాగశౌర్య ఆగ్రహం వ్యక్తం  చేశారు. నడిరోడ్డుపైనే యువకుడిని నిలిదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు ఇలా సాంఘిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఇక కరోనా సమయంలో మూగజీవాలను, ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ కు ఆహారం అందించి మానవత్వం చాటుకుంది. మరోవైపు తన కేరీర్ లోనూ దూసుకుపోతోంది. బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీషోతో అలరిస్తోంది.  అలాగే నటిగానూ అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. గతంలో హీరోయిన్ గా ‘గుంటూరు టాకీస్’, ‘అంతం’ ‘నెక్ట్స్ నువ్వే’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపైన కొనసాగుతూనే నటిగా వచ్చిన అవకాశాలను అందుకుంటోంది. మరోవైపు తనదైన 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios