జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై హాట్ గా కనిపిస్తూ తన యాంకరింగ్ తో వినోదం అందిస్తోంది రష్మీ. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై హాట్ గా కనిపిస్తూ తన యాంకరింగ్ తో వినోదం అందిస్తోంది రష్మీ. అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా మెరుస్తోంది. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.
జంతువులని ఏవారైనా హింసిస్తున్నట్లు తన దృష్టికి వస్తే రష్మీలో మరో కోణం బయటకి వస్తుంది. జంతువుల పట్ల కేర్ తీసుకునేందుకు రష్మీ తనవంతు సాయం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడిని వీధి కుక్కలు అటాక్ చేసి చంపేసిన సంఘటన సంచలనంగా మారింది.

దీనితో వీధి కుక్కలు లేకుండా చేయాలనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇక జంతు ప్రేమికులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. రష్మీకి కూడా ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ సందర్భంలో కూడా చిన్న పిల్లలపై, ఆ పసివాడి కుటుంబ సభ్యులపై జాలి చూపకుండా.. జంతువుల పట్ల ప్రేమ ఒలకబోయడం నెటిజన్లకు నచ్చడం లేదు.
దీనితో రష్మీ ట్రోలింగ్ కి గురవుతోంది. ఓ నెటిజన్ ట్విట్టర్ లో.. ఆవులు, గొర్రెల వల్ల ఎలాంటి హాని లేదు. కానీ కుక్కల వల్ల తప్పకుండా హాని ఉంది. అది వైల్డ్ యానిమల్. ఆయా విషయం నీకు కూడా తెలుసు. దయచేసి వైల్డ్ యానిమల్స్ ని ఎంకరేజ్ చేయవద్దు అని నెటిజన్ రష్మీకి సూచించాడు.

అవునా అయితే రోడ్ల పైకి వెళ్లి చూడు.. ఎక్కువ ప్రమాదాలు విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవులు, గేదెల వెళ్లే జరుగుతున్నాయి. కానీ ఇది ఆ సందర్భం కాదు అని రష్మీ రిప్లై ఇచ్చింది. దీనితో మరో నెటిజన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రష్మీని కుక్కని కొట్టినట్లు కొట్టాలి అని కామెంట్ చేశాడు.

అతడి కామెంట్ కి రష్మీ అంతే ఘాటుగా దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చింది. తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు.. నేనే పర్సనల్ గా వస్తాను. ఏం చేస్తావో చూస్తాను.. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఘాటుగా బదులిచ్చింది. అంబర్ పేటలో వీధి కుక్కల ఘటనపై జంతు ప్రేమికులు.. తల్లిదండ్రులే అప్రమత్తంగా, పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నారు. దీనితో జంతుప్రేమికుల పట్లనెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
