బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో రష్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి టచ్ లో ఉంటుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మి తాజాగా మరోసారి తనపై కామెంట్స్ చేసిన 
నెటిజన్ కి ఘాటుగా బదులిచ్చింది. అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన రష్మికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

కొందరు ఆమెని అసభ్యకరమైన ప్రశ్నలు అడగడంతో ఓ రేంజ్ లో ఫైర్ అయింది. కొందరు పిచ్చి రాతలు రాస్తూ తనకు అసభ్యకర మెసేజీలు పెడుతున్నారని.. అయితే తాను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి విషయాలు  పట్టించుకోనని చెప్పింది రష్మి. ఆ మెసేజ్ లు తనపై పెద్దగా ప్రభావం కూడా చూపవని చెబుతోంది.

అలా మెసేజ్ లు పెట్టే వారి గురించి పట్టించుకోకపోయినా.. ఆ మెసేజ్ లు సమాజంలో ఎక్కిస్తున్నారని.. అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలూ బాహాటంగా మాట్లాడలేకపోతున్నారని రష్మి అంటోంది. తాను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి తనకు ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని అనుకోవడం పొరపాటని.. రెగ్యులర్ గా ఉద్యోగాలు చేస్తోన్న ఎందరో అమ్మాయిలపై ఇలాంటి దాడి జరుగుతుందని చెప్పింది.

రాత్రికి ఎంతిస్తే వస్తావ్..? ఎంత డబ్బు కావాలంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని.. అలా అడగడానికి సిగ్గుగా లేదా..? అంటూ మండిపడింది. తన ఒక్కదాని గురించే మాట్లాడడం లేదని.. ఇలాంటి బాధలు పడుతోన్న ఎందరో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అంటూ ఫైర్ అయింది.