హాట్‌ యాంకర్‌ రష్మీ టీవీ షోస్‌తోపాటు హీరోయిన్‌గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` అనే చిత్రంలో నటిస్తుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మరో పాట విడుదలైంది. 

ఆదివారం హీరో సుధీర్‌బాబు `నడికుడి రైలంటి.. `అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇది శ్రోతలను మెప్పిస్తుంది. ఈ పాటని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ రాయడం విశేషం. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుల‌వుతుంది. పాట విడుదల చేసిన అనంతరం సుధీర్ బాబు మాట్లాడుతూ, `ఈ చిత్రం టీజ‌ర్ ని చూసినప్పుడే ప్రామిసింగ్ గా అనిపించింది. సినిమాలో నందు కొత్తగా క‌నిపిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా ఇంట్ర‌స్టింగ్గా ఉంది. రష్మీ క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలోని రెండో పాటకి ప్ర‌త్యేక‌త ఉంది. `మెంట‌ల్ మ‌దిలో`, `బ్రోచేవారేవురు` చిత్రాల‌తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించ‌టం. వివేక్ ఆత్రేయ చిత్రాలు చూశాను. చాలా నేచుర‌ల్ గా చిత్రాలు తీసి మెప్పిస్తున్నారు. 

ఇప్పుడు ఆయ‌న్లో మ‌రో యాంగిల్ ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. ఈ పాట‌లో ఆయ‌న రాసిన లిరిక్స్ న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ల్టీటాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఇలా మ‌ల్టిటాలెంటెడ్ ప‌ర్స‌న్స్ ఇండ‌స్ట్రికి రావ‌టం శుభ‌ప‌రిణామం. అంతేకాకుండా ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్ వైకామ్ విజ‌య‌ల‌క్ష్మి గారు పాడ‌టం హైలెట్ గా నిలిచింది.  ఈ చిత్రం నందు కి , ద‌ర్శ‌కుడు రాజ్ విరాఠ్ కి కెరీర్ పెద్ద బ్రేక్ అవ్వాల‌ని కొరుకుంటున్నాను. ప్రోడ్యూస‌ర్స్ కి చాలా మంచి ప్రాఫిట్స్ రావాల‌ని వారు మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కొరుకుంటున్నాను` అని అన్నారు.