యాంకర్‌ ప్రదీప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు యాంకర్‌ ప్రదీప్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. క్షమాపణలు తెలియజేశారు. 

టీవీ యాంకర్ ప్రదీప్‌ మాచిరాజు ఏపీ రాజధాని విషయంలో చేసిన కామెంట్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో యాంకర్‌ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇది ఏపీలోని కొందరి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి మండిపడింది. వెంటనే యాంకర్‌ ప్రదీప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు యాంకర్‌ ప్రదీప్‌ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. క్షమాపణలు తెలియజేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ, `రీసెంట్‌గా జరిగిన ఓ షోలో రాష్ట్రం, దాని క్యాపిటల్‌ ఏంటి అనే ప్రశ్న అడుగుతున్న పద్ధతిలో నేను సీటీ పేరు చెప్పి, ఆ సిటీ క్యాపిటల్‌ ఏంటి అన్నాను. మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్సర్‌ ఇవ్వడంతో ఆ పూర్తి సంభాషణ తప్పుదోవలో వెళ్లింది. అందరికి వేరే విధంగా అర్థమయ్యింది. వాళ్లకది బాధ కలిగించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఎవరినో కించపరిచాలనో, హేళన చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. అలంటి పని నేను ఎప్పుడూ చేయను. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నా` అని వెల్లడిచారు. 

YouTube video player

ఓ టీవీ షోలో యాంకర్‌ ప్రదీప్‌ అమరావతి రాజధాని ఏంటి? అని అడగ్గా అందులో పాల్గొన్న ఆర్టిస్ట్ వైజాగ్‌ పేరు చెబుతుంది. దీంతో ఇది వివాదంగా మారింది. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి మండిపడింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లోని అతడి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే సహించబోమన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో ప్రదీప్‌ సారీ చెప్పారు.