నన్ను భరించి నా కన్నీళ్లు తుడిచాడు.. యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్ వైరల్
స్టార్ యాంకర్ గా లాస్య చాలా కాలం వెలుగు వెలిగింది. సరదాగా మాట్లాడుతూ, తన యాంకరింగ్ తో ఆకట్టుకునే లాస్యకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు లాస్య వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు వినిపించేవి.
స్టార్ యాంకర్ గా లాస్య చాలా కాలం వెలుగు వెలిగింది. సరదాగా మాట్లాడుతూ, తన యాంకరింగ్ తో ఆకట్టుకునే లాస్యకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు లాస్య వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు వినిపించేవి. ఆ వార్తలని పట్టించుకుకోకుండా లాస్య కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.
మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకున్న లాస్య ప్రస్తుతం సంతోషంగా ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ గురించి అనేక విషయాలని పంచుకుంటోంది. ఇదిలా ఉండగా లాస్య వివాహం తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే యాంకర్ లాస్య, మంజునాథ్ దంపతులకు రెండవ సంతానం కలిగింది. లాస్య రెండవసారి కూడా పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని లాస్య సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాస్య, మంజునాథ్ దంపతులు ఫ్యామిలీ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
నేడు లాస్య భర్త మంజునాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లాస్య ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త గురించి అద్భుతంగా వివరిస్తూ భావోద్వేగానికి గురైంది. 'పర్ఫెక్ట్ హస్బెండ్ కి భార్యని అయినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రపంచంలో నా పిచ్చితనాన్ని భరించే ఏకైక వ్యక్తివి నువ్వే. హ్యాపీ బర్త్ డే మంజునాథ్. నువ్వు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నా సక్సెస్ చూశావు. కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉండి నిలబెట్టావు. నా సంతోషానికి కారణం నువ్వే అంటూ లాస్య ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఈ సందర్భంగా భర్తతో ప్రేమగా, సంతోషంగా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫోటోస్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లంతా లాస్య భర్త మంజునాథ్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.