ఇటీవల నిండు గర్భంతో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది అనసూయ. థాంక్ యు బ్రదర్ వెబ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అనసూయ, గర్భవతి పాత్ర చేస్తున్నారు. ఆ మూవీ నుండి ఆమె లుక్ విడుదల చేయగా గర్భంతో కనిపించి సినిమాపై ఆసక్తి రేపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గర్భవతిగా ఉండడం తనకు ఎంతో ఇష్టం అని చెప్పింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు భర్తతో పాటు కుటుంబ సభ్యులు మన పట్ల చాలా కేర్ తీసుకుంటారని, ఆ విషయం నాకు ఎంతో ఇష్టమని అనసూయ చెప్పారు. 

భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్న అనసూయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనసూయకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళతో పాటు మూడో బిడ్డకు జన్మను ఇవ్వడానికి సిద్దమే అని క్రేజీ కామెంట్ చేశారు ఆమె. ఇక కెరీర్ పరంగా అనసూయ టాప్ గేర్ లో వెళుతున్నారు. అటు నటిగా, ఇటు యాంకర్ గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. 

అలాగే దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారట. మరాఠా చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.