బుల్లితెరపై తన సత్తా చాటి ఆ తరువాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. 'క్షణం','రంగస్థలం' వంటి సినిమాలతో నటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అనసూయ నెటిజన్లను ప్రశ్నించింది. 'ఏ సినిమాలోనైనా నటుడు ప్రధాన పాత్రలో కనిపిస్తే దాన్ని కథానాయకుడి ప్రాధాన్యం ఉన్న సినిమా అని ఎవరూ అనరు.
అదే ఓ నటి ప్రధాన పాత్రలో కనిపిస్తే మాత్రం ప్రత్యేకించి దాన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా, లేడీ ఓరియెంటెడ్ సినిమా అని ఎందుకు అంటారు' అంటూ నెటిజన్లను బదులు కోరింది. ఆ తరువాత తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని, నిజాయితీగా అడిగానని తెలిపింది.
'తెరపై కనిపించే ప్రతి పాత్రకి దాని పరిధిని బట్టి ప్రాధాన్యం ఉంటుంది. హీరో, హీరోయిన్, హాస్యనటుడు, హాస్యనటి, సహాయనటుడు, సహాయనటి.. ఇలా ప్రతి పాత్ర ముఖ్యమే.. మేమంతా పాత్రల్ని పోషిస్తున్నాం.
సరైన విధంగా మమ్మల్ని పిలవాలనేది నా అభిప్రాయం. ప్రధాన పాత్రలో ఆయన/ఆమె నటిస్తున్నారు అంటే సరిపోతుంది కదా'' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.