నేను హనుమాన్ భక్తురాలిని, కొడుకు గురించి ఆ సీక్రెట్ రివీల్..అయోధ్య రాముడిపై అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. ప్రజలంతా ఆ చారిత్రాత్మక క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.

Anchor Anasuya latest post in ayodhya ram mandir goes viral dtr

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. ప్రజలంతా ఆ చారిత్రాత్మక క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రముఖులందరికి అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. 

కాగా సోషల్ మీడియాలో సైతం శ్రీరాముడు, అయోధ్య కి సంబందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా యాంకర్ అనసూయ కూడా అయోధ్య రాముడి గురించి ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న శుభ సందర్భంలో అనసూయ కామెంట్స్ చేస్తూ.. ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు ఇది. నేను హనుమంతుడికి పరమ భక్తురాలిని. ఆయన పేరు వచ్చేలాగే నా కొడుకు పేరు కూడా పెట్టాం. శ్రీరాముడే హనుమంతుడికి సర్వస్వం. 

ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది.. ఇప్పుడు జరుగుతోంది. శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరాముడిని అయోధ్యలో ధరించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రానున్న రోజుల్లో అది నెరవేరుతుంది.. జై శ్రీరామ్ అంటూ అనసూయ పోస్ట్ చేసింది. 

రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్ సినీలోకం మొత్తం అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించనున్నారు.  రంగస్థలం, పుష్ప, క్షణం  లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.  అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios