స్టార్ యాంకర్ అనసూయ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియోలో అసలు మగాళ్లతో పనేంటి? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తుంది.  

అనసూయ (Anasuya Baradwaj)కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా, యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్న అనసూయ... హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్నారు. దర్జా టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో అనసూయ ప్రధాన పాత్ర చేస్తున్నారు. కెరీర్ రేసు గుర్రంలా పరుగెడుతున్నప్పటికీ, సోషల్ మీడియాను మాత్రం వదలరు. 

తరచుగా అనసూయ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. పొట్టిబట్టల్లో హాట్ ఫోజులిస్తూ అభిమానుల మనసులు దోచేస్తూ ఉంటారు. తాజాగా అనసూయ షేర్ చేసిన ఓ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సదరు వీడియోలో ఆమె భర్త కూడా ఉండగా.. అసలు మగాళ్లతో అవసరమేంటి..? అంటూ ప్రశ్నించారు. అలాంటి బోల్డ్ కామెంట్ చేసిన అనసూయ... జస్ట్ జోక్ అంటూ సమర్ధించుకుంది. ఫెమినిస్ట్ అని చెప్పుకునే అనసూయ ఇలాంటి వీడియో చేయడం ఆసక్తికరంగా మారింది. 

అనసూయ గొప్ప ఫెమినిస్ట్. ఆమె ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ఎవరైనా మహిళకు అన్యాయం జరిగిందని తెలిస్తే సోషల్ మీడియా వేదికగా తన గొంతు విప్పుతారు. అలాగే తన బట్టలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఊరుకోరు. అనసూయ టెలివిజన్ షోలలో ధరించే పొట్టిబట్టలపై అనేక మార్లు విమర్శలు తలెత్తాయి. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ... తనని తాను సమర్థించుకుంటోంది అనసూయ. 

View post on Instagram

మరి అలాంటి ఫైర్ బ్రాండ్ నుండి ఇలాంటి కామెంట్స్ రావడంలో తప్పేం లేదు. ఇక పోతే అనసూయ ప్రేమ వివాహం చేసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించారు. పెద్దలను ఎదిరించి అతన్ని వివాహం చేసుకున్నారు. అప్పటికి అనసూయ కెరీర్ ఇంకా గాడిన పడలేదు. పెళ్లి తర్వాత నటిగా, బుల్లితెర యాంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జబర్దస్త్ షో ఆమె ఫేట్ మార్చేసింది. ఆ షో వలన వచ్చిన ఫేమ్ అనసూయను వెండితెరపై కూడా బిజీ నటిగా మార్చింది. 

ఇటీవల విడుదలైన ఖిలాడి మూవీలో కీలక రోల్ చేసిన అనసూయ పుష్ప 2 చిత్రంతో పాటు రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు. ఇక అనసూయకు ఇద్దరు పిల్లలు కాగా.. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ని బాలన్స్ చేస్తూ ముందుకు పోతుంది.