మంచు వారి ఆస్థాన యాంకర్‌గా మంచు కుటుంబాన్ని ఏలిన నాకు.. ‘మిస్టర్ నూకయ్య’ సినిమాతో తొలి సారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మంచు మోహన్ బాబు గారితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం నాకు గర్వంగా వుంది. ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే మంచు ఫ్యామిలీ ఇచ్చిన బ్లెస్సింగ్సే కారణం అంది యాంకర్, నటి అనసూయ.

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తూ.. ఆయనే రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’ ఆడియో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం నాడు వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో అనసూయ మాట్లాడుతూ.. మోహన్ బాబుని బావగారూ.. మీరేనా నన్ను పట్టేసింది.. అంటూ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇక అనసూయ స్పీచ్ కొనసాగుతుండగానే.. మోహన్ బాబు కల్పించుకుని నువ్.. బేబీ స్టెప్స్ వేయడం ఏంటీ అంటూ అనసూయకు నవ్వుతూనే కౌంటర్ వేయడంతో.. అక్కడే ఉన్న మంచు విష్ణు కల్పించుకుని స్టేజ్ దగ్గరకు వెళ్లి మైక్ తీసుకుని ఏంటి మనోజ్ సినిమాకు నువ్వు చిన్న పిల్లవా?.. రేయ్ నీ సినిమాకు చిన్నపిల్లదంట్రా అని మనోజ్‌ను చూపిస్తూ విష్ణు నవ్వులు కురిపించారు. అబ్బా మీరు ఇలాంటివే పట్టకోండి అంటూ.. బేబి స్టెప్స్ అంటే కెరియర్ పరంగా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నా అంటూ కవర్ చేసుకున్న అనసూయ.. మోహన్ బాబుని ఉద్దేశించి ‘బావగారూ మీరేనా పట్టుకుంది (తన మాటలని) అంటూ తెగ సిగ్గు పడిపోయింది. 

ఇక తెలుగు పదాలు సరిగ్గా రావడంలేదని... ఇంగ్లీష్ మాట్లాడొద్దన్నారని.. ఇక మంచు కుటుంబం వారి మంచు వారి చూపు మాత్రమే నాపై ఉండాలని కోరుకుంటున్నానని అంది అనసూయ. ఇక అనసూయ తనను బావగారూ.. అని పిలవడం పట్ట మోహన్ బాబు తనదైన శైలిలో పంచ్ పేల్చారు. ‘నా భార్యే నన్ను బావ అని పిలవదు.. అనసూయ చూడు ఎంత అందంగా బావ అని అంటుందో’ అన్నారు మోహన్ బాబు. అలా సరదాగా సాగింది గాయత్రి ఆడియో రిలీజ్ వేడుక.