‘పుష్ప’ చిత్రం విడుదలై దాదాపు ఏడాదికి దగ్గరవుతున్న ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ తో బుల్లితెర బ్యూటీ, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ చెప్పించిన ‘పుష్ప’ డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సినిమా వచ్చి దాదాపు ఏడాది కావాస్తున్నా ఇంకా చిత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పుష్పరాజ్ మేనరిజం, డైలాగ్స్, పాటలు ఏదోచోట ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ కూడా ‘పుష్ఫ రాజ్’ మేనరిజాన్ని అనుసరించారు. ఆయనతోపాటు స్టార్ యాంకర్ అనసూయ కూడా ఉన్న ‘పుష్ప’ డైలాగ్ చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దసరా పండుగను పురస్కరించుకొని న్యూయార్క్ లో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అనసూయ కూడా వచ్చింది. కార్యక్రమం అనంతరం అనసూయ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో కలిసి ‘పుష్ఫ’లోని ‘తగ్గేదే లే’ డైలాగ్ ను చెప్పించింది. అల్లు అర్జున్ స్టైల్ లోనే మేయర్ కూడా చెప్పారు. ఆ వీడియోను న్యూయార్క్ మేయర్ ఆఫీస్ టీం ట్విటర్ ఖాతాలో చేశారు. దీంతో వీడియోపై పుష్ఫ టీం స్పందించారు.
ఇండియన్ సినిమాపై మేయర్ చూపించిన ప్రేమకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దసరా ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీని అభినందించారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు ఆగస్టు 15న బన్నీ న్యూయార్క్ లో నిర్వహించిన ‘ఇండియా డే’ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ బన్నీకి ఘన స్వాగతం పలికారు. మెమోంటోను కూడా అందించారు. తాజాగా మరోసారి న్యూ యార్క్ మేయర్ ‘పుష్ప’ డైలాగ్ చెప్పడం విశేషం.
‘పుష్ప : ది రైజ్’ ఘన విజయం సాధించడంతో.. పార్ట్ 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు దర్శకుడు సుకుమార్. రూ..350 కోట్ల మేర బడ్జెట్ తో రూపొందించబోతున్నారంట. Pushpa The Rule లో మరిన్ని పాత్రలు కూడా కలుస్తాయని, సమంత, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈనెలాఖరులో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో హీరోహీరోయిన్లుగా అల్లు అర్జున్ - రష్మిక మందన్న నటిస్తున్నారు. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
