సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ లో ధరమ్ తేజ్ తో స్టెప్పులేయనున్న అనసూయ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ రొమాన్స్ కు అనసూయ
గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే `విన్నర్` సినిమా అని దర్శకుడు చెప్పారు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
నవంబర్ 2 నుంచి ఉక్రెయిన్ లో మూడు పాటలు చిత్రీకరించబోతున్నామని దర్శకుడు తెలిపారు. సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ మీద చిత్రీకరించబోయే పాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయన్నారు. ఇక ఇస్తాంబుల్ లో మూవీ యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నారు.
ఇక ఈ మూవీ కోసం బుల్లితెర సెక్సీ యాంకర్.. సోగ్గాడే చిన్నినాయనా బ్యూటీ.. అనసూయ మీద ఓ స్పెషల్ సాంగ్, కొన్ని సీన్స్ కూడా ప్లాన్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయని, అన్ని వర్గాల వారికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన రచన ఆకట్టుకుంటుందని, వెలిగొండ శ్రీనివాస్ మంచి కథనిచ్చారని దర్శకుడు అన్నారు.
సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెలకిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: తమన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: ప్రకాష్, ఫైట్స్: రవివర్మ, కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన