గతంలో `జబర్దస్త్` షో వీడటానికి నిర్వహకులతో కొంత విభేదాలు అని చెప్పింది అనసూయ. మరోవైపు కమెడియన్లు తనపై చేసే వల్గర్‌ కామెంట్లు అని చెప్పుకొచ్చింది. తాజాగా అసలు విషయం బయటపెట్టింది.

అనసూయ `జబర్దస్త్` ని వీడి చాలా నెలలవుతుంది. ఆమె ఈ కామెడీ షోని వదిలేయడానికి పలు కారణాలు చెబుతూ వస్తోంది. తాజాగా అసలు కారణం బయటపెట్టింది. సోషల్‌ మీడియాలో అనసూయ తాజాగా ఛాటింగ్‌ చేసింది. అభిమానులతో అనేక విషయాలను పంచుకుంది. ట్రోల్స్, టీవీ షోస్‌ వదిలేయడం, తన పర్సనల్‌ విషయాలను ఆమె షేర్‌ చేసుకుంది. ఇందులో భాగంగా `జబర్దస్త్`ని వీడటానికి అసలు కారణం బయటపెట్టింది అనసూయ. ఈ క్రమంలో టీవీ షోస్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

గతంలో `జబర్దస్త్` షో వీడటానికి నిర్వహకులతో కొంత విభేదాలు అని చెప్పింది అనసూయ. మరోవైపు కమెడియన్లు తనపై చేసే వల్గర్‌ కామెంట్లు అని చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్‌ కామెంట్ల పట్ల అభ్యంతరం తెలిపింది. అంతేకాదు తన పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్లకి అన్నీ తెలుస్తున్నాయి, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు అర్థమవుతున్నాయని, అందుకే ఈ టైమ్‌ లో ఇది సరికాదని , జబర్దస్త్ ని వీడినట్టు గతంలో చెప్పుకొచ్చింది హాట్‌ యాంకర్‌ అనసూయ. 

తాజాగా అసలు విషయం బయటపెట్టింది. తాను ఎందుకు వీడాల్సి వచ్చిందో పరోక్షంగా చెప్పిందీ రంగమ్మత్త. నెటిజన్లతో చేసిన ఛాటింగ్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. అందులో భాగంగా ఓ నెటిజన్‌ `మళ్లీ టీవీ షోస్‌లో ఎప్పుడు మెరుస్తావ్‌, మిమ్మల్ని చూడాలనుకుంటున్నామ`ని ప్రశ్నించాడు. దానికి అనసూయ స్పందించింది. టీవీ షోస్‌పై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. టీఆర్‌పీ స్టంట్‌లను బయటపెట్టింది.

`విపరీతమైన, అగౌరవకరమైన టీఆర్‌పీ స్టంట్స్ పోయినప్పుడు తాను టీవీలో ఉండకపోవడాన్ని మిస్‌ అవుతాను` అని చెప్పింది అనసూయ. టీఆర్‌పీల కోసం చేసే స్టంట్స్ పోతేనే తాను ఇలాంటి షోస్‌కి మళ్లీ రావడానికి ఆలోచిస్తాననే అర్థంలో అనసూయ ఈ కామెంట్‌ చేసింది. అదే సమయంలో టీవీ షోస్‌ బండరాలను బయటపెట్టింది. టీఆర్‌పీ రేటింగ్‌ కోసం ఇలాంటి అగౌరవపరిచే డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, పంచ్‌లు వేస్తుంటారని ఆమె చెప్పకనే చెప్పింది. మొత్తానికి తాను `జబర్దస్త్`ని వీడిపోవడానికి కూడా ఇలాంటి కారణాలే అనే విషయాన్ని చెప్పేసింది. టీవీ షోస్‌లన్నీ ఇలా టీఆర్‌పీ స్టంట్స్ కి పాల్పడుతున్నాయని ఆమె వెల్లడించింది. 

అనసూయ `జబర్దస్త్`లో యాంకర్‌ గా మంచి పేరు, గుర్తింపు, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ రోజు ఆమెకి సోషల్‌ మీడియాలో ఇంతటి క్రేజ్‌ ఉందంటే అది `జబర్దస్త్` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్‌గా చేసి ఆ తర్వాత షోపై పలు విమర్శలు చేస్తూ బయటకు రావడం పట్ల విమర్శలెదుర్కొంది. ఇన్నాళ్లు అది చెడుగా అనిపించలేదా? అంటూ ప్రశ్నించారు నెటిజన్లు. పారితోషికం కోసమే ఆమె బయటకు వచ్చిందనే ప్రచారం జరిగింది. 

ఇదిలా ఉంటే `జబర్దస్త్`ని వీడినప్పుడే ఆమెకి స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్‌జూనియర్‌` షోకి యాంకరింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ షో కోసం, పారితోషికం కోసం ఆమె `జబర్దస్త్`ని వదిలినట్టు ప్రచారం జరిగింది. అదే టైమ్‌లో పారితోషికం కోసమే సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్`ని వీడటంతో, అనసూయ కూడా అందుకే వెళ్లిందన్నారు. కానీ అనసూయ తాను వీడటానికి కారణం మరో వెర్షన్‌ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే కొందరు ఫ్యాన్స్ ఆమెని మళ్లీ టీవీ షోస్‌ చేయమంటున్నారు, చాలా మిస్‌ అవుతున్నామని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎదురైన ఈ ప్రశ్నతో క్లారిటీ ఇచ్చింది అనసూయ. 

అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. కీలక పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల `పుష్ప`, `మైఖేల్‌`లో మెరిసిన ఆమె ప్రస్తుతం `పుష్ప 2`, `సింబా`, `రంగమార్తాండ`,తోపాటు తమిళంలో, మలయాళంలో సినిమాలు చేస్తుంది. ఇంకా ప్రకటించని పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం.