అనసూయ తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లలకి సంబంధించిన ఓటు హక్కుని వినియోగించుకుంది. అయితే ఇందులో ఆమె లుక్ మాత్రం అదిరిపోయింది. వైరల్ అవుతుంది.
మాజీ యాంకర్ అనసూయ.. నటిగా బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేస్తుంది. యాంకరింగ్ మానేసి సినిమాలకే పరిమితమయ్యింది. షూటింగ్ ఉంటే సినిమాలు లేదంటే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతుంది. మధ్య మధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఈవెంట్లలో సందడి చేస్తుంది. మరోవైపు అడపాదడపా హాట్ ఫోటో షూట్లతో తన అభిమానులను అలరిస్తుంది. విజువల్ ట్రీట్ ఇస్తుంది.
తాజాగా అనసూయ.. ఓటు హక్కుని వినియోగించుకుంది. ఆమె హైదరాబాద్‌లో తన ఓటుని వేసింది. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుని ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాను ఓటు వేయడం అయిపోయిందని, మరి మీరు వేశారా? అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఓటు వేయాలనే ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇందులో అనసూయ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ఆమె హీరోయిన్లని మించిన అందంతో కట్టిపడేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆమె మేకప్ లేకుండానే కనిపించింది. జస్ట్ లైట్ మేకప్‌లో కేకపెట్టించేలా ఉంది. ముట్టుకుంటే మాసిపోతుందనేలా పాల బుగ్గల అందంతో ఆకట్టుకుంటుంది అనసూయ. ఆమె సెల్ఫీ లుక్ లో ఎంతో క్యూట్‌గా ఉంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. అనసూయ ఈ నయా పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
అనసూయ.. యాంకరింగ్ మానేసి ఏడాదికిపైనే అవుతుంది. `జబర్దస్త్` షోకి అనసూయ యాంకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే అందులో తనపై వచ్చే కామెంట్లు, బాడీ షేమింగ్ సెటైర్ల విషయంలో హర్ట్ అయిన ఆమె దాన్నుంచి తప్పుకుంది. తన పిల్లలు పెరుగుతున్నారని, వారిని అన్నీ అర్థమవుతున్నాయని చెప్పింది అనసూయ ఈ షో నుంచి తప్పుకుంది. మరోవైపు నిర్వహకుల నిర్లక్ష్యం కూడా ఆమె తప్పుకోవడానికి ఓ కారణమని చెప్పింది. ఇకపై ఏదైనా స్పెషల్‌గా ఉంటేనే యాంకరింగ్ చేస్తానని చెప్పింది.
అయితే అనసూయ నటిగానే బిజీగా ఉంది.ఈ ఏడాదిలోనే ఆమె నాలుగు సినిమాలతో మెరిసింది. `రంగమార్తాండ`లో కోడలి పాత్రలో మెరిసింది. గయ్యాలి కోడలిగా నటించి మెప్పించింది. ఇక `విమానం` సినిమాలో వేశ్యగా కనిపించి షాకిచ్చింది. అందాల వేశ్యగా అదరగొట్టింది. మరోవైపు `ప్రేమ విమానం` సినిమాలో పేద మహిళగా నటించి ఆకట్టుకుంటుంది. అప్పులు తీర్చేందుకు ఆమె పడే పాట్లు కదిలించాయి. పేదమహిళగా ఒదిగిపోయి చేసింది అనసూయ.
మరోవైపు `పెదకాపు`లో మహిళా నాయకు రాలిగా, దగా పడ్డ మహిళగా కనిపించి మెప్పించింది. క్లైమాక్స్ లో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది అనసూయ. ఇప్పుడు ఆమె చేతిలో `పుష్ప2` వంటి పలు క్రేజీ ప్రాజెక్టులు ఉండటం విశేషం.
