యాంకర్ అనసూయకి క్రేజీ ఆఫర్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Apr 2019, 12:11 PM IST
Anasuya getting terrific offers
Highlights

'రంగస్థలం' సినిమా పల్లెటూరి మహిళ పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించిన యాంకర్ అనసూయకి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

'రంగస్థలం' సినిమా పల్లెటూరి మహిళ పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించిన యాంకర్ అనసూయకి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అయితే అనసూయ మాత్రం తన పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని అనిపిస్తేనే ఆమె ప్రాజెక్ట్ సైన్ చేస్తోంది.  తాజాగా ఈమెకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయని అనుకుంటున్నారట.

అలానే కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో అనసూయ కోసం ఓ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్రలకు ఇంపార్టన్స్ ఉండడంతో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

త్వరలోనే మెగాస్టార్ సినిమా లాంచ్ కానుంది. ఆరోజునే కాస్టింగ్ డీటైల్స్ కూడా అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి అనసూయ టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు కొట్టేస్తుంది. 

loader