అనసూయకి సోషల్ మీడియాలో తన గ్లామర్ తోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. బోల్డ్ గా ఫోజులు ఇస్తూ కుర్రకారుని ఆకర్షించడం రంగమ్మత్త శైలి. అయితే ఆన్ స్క్రీన్ పై మాత్రం ఆమె గ్లామర్ మంత్రం పనిచేయడం లేదు.

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. 

అనసూయకి సోషల్ మీడియాలో తన గ్లామర్ తోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. బోల్డ్ గా ఫోజులు ఇస్తూ కుర్రకారుని ఆకర్షించడం రంగమ్మత్త శైలి. అయితే ఆన్ స్క్రీన్ పై మాత్రం ఆమె గ్లామర్ మంత్రం పనిచేయడం లేదు. దర్శకులు అనసూయకి ఎక్కువగా డీ గ్లామర్ రోల్సే ఇస్తున్నారు. 

రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా చేసినా.. పుష్పలో దాక్షాయణిగా మెప్పించినా అవి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు. అనసూయ నటిగా మంచి గుర్తింపు పొందుతోంది. అయితే ఆమెని గ్లామర్ పరంగా అభిమానించే వారు మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు. తాజాగా మరోసారి అనసూయ తన ఫ్యాన్స్ కి షాకిచ్చింది. 

ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వూల్ఫ్ చిత్ర టీజర్ విడుదలయింది. ఈ చిత్రంలో అనసూయ, రాయ్ లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఇది ఒక హర్రర్ టైపు వైల్డ్ మూవీలా అనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేవాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే నటీనటుల వేషధారణ ఉంది. అనసూయ అయితే మరీ వైల్డ్ గా గగుర్పాటుకి గురిచేసే లుక్స్ తో షాకిచ్చింది. 

YouTube video player

తాంత్రికురాలి తరహాలో అనసూయ గెటప్ ఉంది. బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అనసూయ ఇంత భయంకరంగా కనిపిస్తోంది ఏంటి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె దృశ్యాలని పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది టీజర్ మాత్రం సినిమాలో నటనతో ఎలా మెప్పించిందో చూడాలి. ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వినో వెంకటేష్ రూపొందిస్తున్నారు.