సూపర్‌స్టార్ మ‌హేశ్ తాజా చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  బ్యాంక్‌ స్కామ్‌ల ఆధారంగా రూపొందే ఈ సినిమాలో కామెడీకు లోటు లేదు అంటున్నారు. ముఖ్యంగా ఓ కామెడీ ట్రాక్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఫిల్మ్ సర్క్లిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ కామెడీ ట్రాక్ లో అనుసూయ కీ రోల్ చేస్తోంది. పరుశరామ్ ఈ ట్రాక్ ని సెకండాఫ్ లో నడుపుతాడని, హీరో స్టోరీ సెకండాఫ్ లో సీరియస్ యాక్షన్ తో నడుస్తూంటే ఈ ట్రాక్ రిలీఫ్ ఇస్తుందంటున్నారు.  వెన్నెల కిషోర్, పోసాని మధ్య సాగే ఈ కామెడీ ట్రాక్  లో అనసూయ కూడా ఉంటుందట. వీళ్ళ ముగ్గురి మధ్య కామెడీతో నడిచే ఫుల్ కన్ ఫ్యూజన్ డ్రామా ఉంటుందని చెప్పుకుంటున్నారు.
 
ఇక  ఈ సినిమా చాలా కాలం క్రితమే..షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే సెట్స్‌ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా కోవిడ్‌ ప్రభావంతో ఇంకా మొదలే కాలేదు.  ఈ చిత్రం  షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. చిత్ర టీమ్  నవంబర్‌లో అమెరికాలో 45 రోజులపాటు షూటింగ్ జరపాలనుకున్నారు.  అయితే వీసా సమస్యలు రావటం, అక్కడ కరోనా కేసులు ఎక్కువ నమోదు అవటంతో ...  ఈ షెడ్యూల్  ప్లాన్‌లో మార్పులు చేసారని సమాచారం.  ‘సర్కారువారి పాట’ చిత్ర టీమ్ జనవరి నెలలో అమెరికా ప్రయాణం కాబోతున్నారు. అయితే అక్కడ కరోనా పరిస్దితి ని బట్టి షెడ్యూల్ ప్లాన్ లో మార్పులు చేస్తారు. అమెరికా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. అంటే మరో మూడు నెలలు ముందుకు వెళ్లిందన్నమాట.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు. దాంతో అందరి దృష్టీ ‘సర్కారు వారి పాట’పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పరుశరామ్, అతని టీమ్ ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేసి, వెనక్కి తిరిగి వచ్చారు. 
 
 మరో ప్రక్క ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే.. డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 35కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మేయ‌బోతున్నారు. అది కూడా భారీ రేటుకే అని తెలుస్తోంది.

  మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. 

 GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
సంగీతం: థమన్ .ఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.