`రంగస్థలం`లో రంగమ్మత్తగా రచ్చ చేసిన అనసూయ వరుసగా బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. ఇప్పుడు మరోసారి బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. తాజాగా ఆ పిక్ నెట్టింట రచ్చ చేస్తుంది.
హాట్ యాంకర్ అనసూయ బలమైన పాత్రలు చేస్తూ బిగ్ స్క్రీన్‌పై మెప్పిస్తుంది. అయితే ఆమె చాలా వరకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తుంటుంది. ఆ మధ్య `పుష్ప`, `దర్జా`లో నెగటివ్ రోల్స్ చేసింది. మరోవైపు ఐటైమ్ సాంగులు కూడా చేసింది. కానీ ఇప్పుడు బోల్డ్ రోల్‌లో మెరవబోతుంది. `విమానం` చిత్రంలో అనసూయ బోల్డ్ రోల్ చేస్తుందట. ఇందులో ఆమె సుమతి పాత్రలో కనిపించబోతుందని తాజాగా చిత్ర బృందం తెలిపింది.
సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న `విమానం` సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ ఇతక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో మీరా జాస్మిన్ మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతున్నారని చెప్పొచ్చు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై `విమానం` చిత్రం తెరకెక్కుతుంది. నేడు(మే15) సోమవారం అనసూయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి అనసూయ పాత్రని రివీల్ చేసింది యూనిట్.
`జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించనుంది అనసూయ భరద్వాజ్. సోమవారం అనసూయ భరద్వాజ్ బర్త్ డే సందర్భంగా `విమానం` మూవీ మేకర్స్ సుమతి పాత్రకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అసలు ఆమె అలా రెడీ కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
‘విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. అసలీ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే అని టీమ్ పేర్కొంది.
నటీనటులు:
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్
సాంకేతిక వర్గం:
ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రపీ: వివేక్ కాలేపు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్: చరణ్ అర్జున్
ఆర్ట్: జె.జె.మూర్తి
డైలాగ్స్: హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం)
లిరిక్స్ : స్నేహన్(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్.ఒ: నాయుడు - ఫణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువరాజ్ (తమిళ్)
డిజిటల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా
