లాక్‌ డౌన్‌ కారణంగా స్టార్ యాంకర్‌ అనసూయ దాదాపు మూడు నెలలు ఇంటికే పరిమితమైంది. షూటింగ్‌లు వాయిదా పడటంతో ఫ్యామిలీతో కలిసి ఇంటి పనుల్లో మునిగిపోయింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతి లభించటంతో అనసూయ నెమ్మదిగా బిజీ అవుతోంది. కరోన భయం వెంటాడుతున్నా.. ధైర్యం చేసి షూటింగ్‌లలో పాల్గొంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే జబర్థస్త్‌ షో ప్రసారం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త తనకు ఎంతో ధైర్యం చెబుతున్నాడని తెలిపింది అనసూయ.

అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌, షూటింగ్ జరుగుతున్న సెట్స్‌ వద్దకు వచ్చి మరీ ఆమెకు ధైర్యం చెబుతున్నారట. భరద్వాజ్‌ తీరుతో తనకు ఎంతో ఆత్మవిశ్వాసం వస్తోందని చెపుతోంది అనసూయ. తాజాగా తన భర్తతో కలిసి సెట్‌లో తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది అనసూయ. తన తల్లి వండిన భోజనాన్ని భర్త షూటింగ్ లొకేషన్‌కు తీసుకువచ్చారంటూ పోస్ట్ పెట్టింది అనసూయ. అంతేకాదు ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలు తనకు బెస్ట్ మెమరీస్‌ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

వీరిద్దరి ఫోటోలు చూసిన నెటిజెన్లు బెస్ట్ కపుల్‌, క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అది ఏ షోకు సంబంధించి షూట్‌ అన్న విషయాన్ని మాత్రం అనసూయ వెల్లడించలేదు. అయితే ఇటీవల న్యూ లుక్‌లో కనిపిస్తున్న అనసూయపై విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.