తమిళనాడుకు చెందిన కొందరు చిన్నారులు లియో చిత్రంలోని 'నే రెడీ రా' అంటూ సాగే మాస్ సాంగ్ ని బ్యాండ్ తరహాలో పాడారు.

దళపతి విజయ్ నటించిన లియో చిత్రం కొన్ని వారాల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని మించే స్థాయిలో లేనప్పటికీ పర్వాలేదనిపించింది. విజయ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ము లేపింది. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రిష కథానాయికగా నటించగా యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. 

విజయ్ తమిళనాట అభిమానులకు ఆరాధ్య హీరో. ఆయన చిత్రాలు డైలాగులు కానీ, పాటలు కానీ, మ్యానరిజమ్స్ కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకరిస్తూ వైరల్ చేస్తుంటారు. తాజాగా టాలీవడ్ నటి, క్రేజీ యాంకర్ అనసూయ చిన్నారుల ట్యాలెంట్ గుర్తిస్తూ పోస్ట్ చేసింది. 

ఇంతకీ ఈ పోస్ట్ లో ఏముందంటే.. తమిళనాడుకు చెందిన కొందరు చిన్నారులు లియో చిత్రంలోని 'నే రెడీ రా' అంటూ సాగే మాస్ సాంగ్ ని బ్యాండ్ తరహాలో పాడారు. ఓ కుర్రాడు పాట పడుతుండగా మిగిలిన చిన్నారులు ఆర్కెస్ట్రా తరహాలో మ్యూజిక్ వాయిస్తున్నారు. 

View post on Instagram

వాళ్ళ ట్యాలెంట్ కి ఎవరైనా ఫిదా కావలసిందే. ఒరిజినల్ వర్షన్ కంటే అద్భుతంగా పాడారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనిరుద్ చూస్తే తప్పకుండా జలసీ ఫీల్ అవుతాడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిన్నారులు పాడిన వీడియోను అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభినందించింది. 

'వావ్ వీళ్ళకి ఎంతో ట్యాలెంట్ ఉంది. వీళ్ల ప్రతిభ గుర్తింపు లేకుండా మరుగున పడిపోకూడదు' అని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సైతం ఈ వీడియో వైరల్ గా మారింది. చిన్నారుల లియో సాంగ్ ని మీరూ చూసేయండి.