Asianet News TeluguAsianet News Telugu

శాకుంతలం నుంచే మొదలైంది.. ఇక్కడ ఉండాలంటే అలాంటి ఫోటోలు తప్పదు, అనన్య నాగళ్ళ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

Ananya Nagalla said reason for her glamorous photos dtr
Author
First Published Nov 6, 2023, 6:39 PM IST

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. సమంత శాకుంతలం చిత్రంలో కూడా అనన్య చిన్న పాత్రలో నటించింది. 

అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. అనన్య ఆ తరహా పాత్రలే కాదు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు వదులుతోంది. ఇటీవల అనన్య నాగళ్ళ ఎక్కువగా యువతని అట్రాక్ట్ చేసే గ్లామర్ ఫొటోలే షేర్ చేస్తోంది. 

అన్వేషి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అనన్య నాగళ్ళ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. అయితే ఆమె గ్లామర్ ఫోటోలపై చర్చ జరిగింది. ఇంత గ్లామరస్ గా తరచుగా ఫోటోలు షేర్ చేయడం ఎందుకు అని ప్రశ్నించగా అనన్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

వకీల్ సాబ్ ముందు వరకు ఎక్కువగా ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్ పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్నా. ఇక్కడ మనం కూడా రేసులో ఉండాలి. కాబట్టి అలాంటి గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం తప్పనిసరి. అదే అసలు కారణం. ఇంకేమి లేదు అని అనన్య సమాధానం ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios