గోహత్యలపై దేశం మొత్తం చర్చ జరిగింది. ఈ వ్యవహారం తర్వాత 'జైశ్రీరామ్' పదం వల్ల హత్యలు జరిగిపోతున్నాయంటూ కొందరు విమర్శలు సంధిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి మోడీ భాద్యత వహించాలనేది విమర్శలు చేస్తున్న వారి డిమాండ్. 

దీనిపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తనదైన శైలిలో వాక్ బాణాలు సంధించారు. జైశ్రీరామ్ పదం వల్ల హత్యలు జరిగిపోతున్నాయనేవారు మేధావులు కాదు.. నకిలీ మేధావులు అని అనంత శ్రీరామ్ అన్నారు. ఈ మేరకు శ్రీరామ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 

సెటైరికల్ గా ఉన్న ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. జైశ్రీరామ్ అనే పదం వల్ల ఎన్నో దారుణ కాండలు జరిగిపోతున్నాయట. దానికి ప్రధానమంత్రి భాద్యత వహించాలట. అంటే ఇప్పుడు శ్రీరామ్ అనే పదాన్ని నిఘంటువులో నుంచి తొలగించాలా అని అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. అనంత శ్రీరామ్ కామెంట్స్ పై భిన్న స్పందన వినిపిస్తోంది.