పెంగ్విన్‌, వి, నిశ్శ‌బ్దం.. ఇలా వరసపెట్టి అమేజాన్ ప్రైమ్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. దాంతో అమేజాన్ తాము కొనబోయే సినిమాల విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుందని అంతా భావించారు. అయితే తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ యొక్క రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ని మంచి రేటుకు కొన్నట్లు తెలుస్తోంది. 2020 నవంబర్ 20 న ప్రీమియర్ ప్రదర్శిస్తామని ఇటీవల వారు ప్రకటించారు.  అమెజాన్‌కు 4.5 కోట్లు కు అమ్మిన 2 వ చిత్రానికి ఆనంద్ దేవరకొండకు ఇది భారీ ఆఫర్. 

నిజానికి ఇది చాలా చిన్న సినిమా. కానీ సినిమా చూసిన తరువాత అమెజాన్ మాత్రమే ఫాన్సీ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చారని మీడియో ప్రచారం జరుగుతోంది. మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా బాగా వచ్చాయని యూనిట్ వారు  చెబుతున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే సినిమా చూసి, బాగుందని భావించిన తర్వాతే కొన్నారా అనేది తెలియాల్సి ఉంది. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి వినోదం మరియు కుటుంబం మొత్తం చూడదగ్గ ఎంటర్టైనర్ గా రూపొందిచారు. 

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీ ప్రధాన పార్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించారు. ఇటీవల వెనిగళ్ల ఆనంద ప్రసాద్ మీడియాతో సంభాషించారు. చిత్రం గుంటూరు నేపథ్యంలో సాగనుంది. ఇందులో వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తోంది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’ కి  జనార్ధన్ పసుమర్తి కథ, మాటలు రాయగా.. వెనిగళ్ల ఆనంద ప్రసాద్ నిర్మించారు. ‘దొరసాని’కి పూర్తి భిన్నమైన పాత్రలో ఆనంద్‌ కనిపిస్తాడని, వినోదంతో పాటు అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుందని ప్రకటించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వినోద్‌ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.