ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన `బేబీ` సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ డేట్ ప్రకటన వినూత్నంగా చేశారు. ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.
విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం `బేబీ`. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో హీరోగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది యూనిట్. గురువారం ప్రసాద్ ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. అయితే ఈ పోస్టర్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో హీరోయిన్ నోట్లో బ్లేడ్ పెట్టుకుని, హీరో నోట్లో ఆ బ్లేడ్‌ని పెడుతున్నట్టుగా ఈ పోస్టర్ టూ మచ్ స్పైసీగా ఉంది. హనీ కిల్లర్ తరహాలో ఈ పోస్టర్ కనిపిస్తుంది.
బ్లేడ్‌తో లిప్ కిస్సులతో కూడిన పోస్టర్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. అందరిని షాక్‌కి గురి చేస్తుంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. లక్షల పబ్లిసిటీ ఒక్క రోజులో చేసేసింది. ఈ సినిమా ఏంటనేదానిపై అందరి దృష్టి పడింది. ఆనంద దేవరకొండ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో ఆ అటెన్షన్ మరింత పెరిగింది. అందుకే ఇప్పుడు `బేబీ` మూవీ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతూ, సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇక `బేబీ` సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఐమాక్స్ వద్ద 70 అడుగుల పోస్టర్‌ని రిలీజ్ చేయడం కూడా ఈ సినిమాపై చర్చకు దారితీస్తుంది.
`బేబీ` సినిమాని జులై 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది యూనిట్. గతంలోనూ ఈ డేట్ ని వెల్లడించారు. తాజాగా దాన్ని అధికారికంగా కన్ఫమ్ చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి వీడియో గ్లిమ్స్ వచ్చిన దగ్గరి నుంచే ఈ చిత్రం పైన ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్ తెలుగు సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో సినిమాపై క్రేజ్ పెరుగుతూ వచ్చింది.
తాజాగా విడుదల తేదీ పోస్టర్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ అటెండ్ అయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్. ఈ సినిమా ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు, అలానే ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ : ఎమ్ఎన్ బాల్ రెడ్డి అందిస్తున్నారు.
