'బేబీ' సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్మేసారని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ...


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న(ఈరోజు) థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.'కలర్ ఫోటో' వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో యూత్ కు బాగా నచ్చుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ కూడా బాగానే క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అవి నిజం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ చూద్దాం.

 అందుతున్న సమాచారం మేరకు 'బేబీ' సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్మేసారని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' రూ.8 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. సినిమా రిలీజ్‌కు ముందే ఈ డీల్ జరిగినట్లు తెలిసింది. ఓ చిన్న సినిమాకు ఈ స్దాయిలో రిలీజ్ కు ముందే ఓటిటి బిజినెస్ జరగడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కేవలం డిజిటల్ రైట్స్ తోనే ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి వచ్చినట్లు. ఇక థియేటర్ లో వచ్చే రెవిన్యూ, శాటిలైట్, హిందీ రైట్స్, రీమేక్ రైట్స్ అదనం. 

సినిమా ఈ రోజుల్లో యూత్ కు పడితే చాలు వాళ్లే మహారాజ పోషకలు. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్. యూత్ కు బాగా నచ్చిన ప్రేమిస్తే, ఆర్ ఎక్స్ 100 చిత్రాల రిఫరెన్స్ తో చేసినట్లు ఉన్న ఈ కథ తమిళనాడులో జరిగిన ఓ యధార్ద సంఘటనకు ప్రతిరూపం అని చెప్తున్నారు. 'గుండెలపై కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరూ కొట్టలేరు' - అనే ఒక్క డైలాగుతో సినిమా మొత్తాన్ని లేపి నిలబెట్టారు. నిజం చెప్పాలంటే సాయి రాజేష్ రైటింగ్ బేబీ'కి అసలైన బలం. ఇంటర్వెల్, క్లైమాక్స్ & మాటలు, పాటలు! సాయి రాజేష్ ప్రతీ విషయంలోనూ తన మార్క్ చూపించారు. ఈ సినిమాలో కొన్ని డైలాగులు థియేటర్లలో ఆటం బాంబుల్లా పేలటమే కలిసొచ్చింది.