రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో తమ్ముడు ఇటీవల దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా  సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో సెకండ్ మూవీతో ఎలగైన్స్ సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. 

మొదటి అడుగులోనే ఒక ఛాలెంజిగ్ కథను ఎంచుకున్న ఆనంద్ ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ లో ప్రజెంట్ జనరేషన్ కి సంబందించిన ఒక యూత్ఫుల్ కథను ఎంచుకున్నట్లు టాక్. ఇక ఆ సినిమాను శమంతకమణి - పైసా వసూల్ వంటి సినిమాలను నిర్మించిన వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నారు. 

ఇక సినిమా ద్వారా వినోద్ అనే యువకుడు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అయితే సినిమా కథ మొత్తం ఆంధ్ర లొకేషన్స్ లోనే కొనసాగుతుందట. మంచి మెస్సేజ్ తో పాటు సినిమాలో కామెడీ, ఎమోషన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉంటాయని టాక్ వస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై చిత్ర యూనిట్ నుంచి స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది.