Asianet News TeluguAsianet News Telugu

గంగం గణేశా ట్రైలర్, విగ్రహం చుట్టూ క్రైమ్..ఆనంద్ దేవరకొండ కామెడీ టైమింగ్ భలే ఉందే 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గంగం గణేశా. బేబీ మూవీ సూపర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చిత్రాలపై అంచనాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి.

Anand Devarakonda Gam Gam Ganesha trailer out now dtr
Author
First Published May 20, 2024, 5:10 PM IST

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గంగం గణేశా. బేబీ మూవీ సూపర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చిత్రాలపై అంచనాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన గంగం గణేశా చిత్రం మే 31న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఫన్నీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. గణేష్ విగ్రహం చుట్టూ ఎదో క్రైమ్ జరగబోతోంది. దొంగతనాలు చేసుకునే ఆనంద్ దేవరకొండకి ఆ క్రైమ్ తో సంబంధం ఏంటి అనేది సినిమాలో ఆసక్తికరం కాబోతోంది. 

వాడు సూపర్ మాన్ అయితే నేను బ్యాట్ మాన్ అంటూ ఆనంద్ దేవరకొండ చెబుతున్న డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని బుట్టలో పడేయడం లాంటి సన్నివేశాల్లో ఆనంద్ దేవరకొండ కామెడీ టైమింగ్ చాలా బావుంది. 

ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో జబర్దస్త్ ఇమ్మాన్యూల్ నటించాడు. ఇమ్మాన్యూల్ కూడా నవ్వులు పూయిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండకి జోడిగా ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక నటించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios