Asianet News TeluguAsianet News Telugu

Pushpaka Vimanam: 'పుష్పక విమానం' ట్విట్టర్ రివ్యూ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

Ananand Devarakonda Pushpaka Vimanam twitter review
Author
Hyderabad, First Published Nov 12, 2021, 7:35 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చిన్న చిత్రాలు చేస్తూ తన ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇప్పటి వరకు Anand Devarakonda కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి విజయవంతం కాలేదు. దీనితో తాజాగా ఆనంద్ 'Pushpaka Vimanam' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శుక్రవారం నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.  

ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోవడం.. స్వయంగా ప్రచారాల కోసం Vijay Devarakonda రంగంలోకి దిగడంతో పుష్పక విమానం చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. దీనితో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ట్విట్టర్ లో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. 

పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో చిట్టిలంక సుందర్ పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలోనే సుందర్ కి మీనాక్షి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. పెళ్ళైన మరుసటితోజే మీనాక్షి పారిపోతుంది. సమాజానికి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టేందుకు సుందర్ ఎంతో కష్టపడుతుంటారు. 

కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ట్విటర్ జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయ్యిందనే పాయింట్ చూస్తూనే కథ తిరుగుతుంది. కానీ బోర్ కొట్టించకుండా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. 

Also Read: తన పెళ్లిపై కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

ఇక సెకండ్ హాఫ్ లో కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి మారుతుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుందని ట్విట్టర్ లో రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ఆశించే అంశాలు సెకండ్ హాఫ్ లో పెద్దగా ఉండవని అంటున్నారు. మొత్తంగా ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అనే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఓటిటి ఫ్లాట్ ఫామ్ కు సరిపోయే కథ అని అంటున్నారు. థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సిన మూవీ కాదని అంటున్నారు. 

ఈ చిత్రం బావుందని మరికొందరు అంటున్నారు. స్క్రీన్ ప్లే ఊహకందని విధంగా ఉంటుందని, చిన్న దేవరకొండ చాలా బాగా నటించాడని ట్విట్టర్ ప్రేక్షకులు కొందరు అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios