బాలీవుడ్ ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ 'అనేగన్' చిత్రంతో కోలివుడ్ కి పరిచయమైంది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ రావడంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది అమైరా. రీసెంట్ గా తెలుగులో ఓ సినిమా చేసింది.

అది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. మీటూ ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆమె ప్రముఖ దక్షిణాది హీరోని టార్గెట్ చేసి కొన్ని ఆరోపణలు చేసింది. సూపర్ స్టార్ అల్లుడు అనుకున్నంత డీసెంట్ కాదంటూ చూచాయిగా అతడి వివరాలు బయట పెట్టేసింది. దీంతో ఆమెకి ఇక తమిళంలో అవకాశాలు రావేమోనని అనుకున్నారు. 

కానీ ఊహించని విధంగా ప్రభుదేవా సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'కాదలై తేడి నిత్యానంద' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభుదేవా హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన అమైరాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

రొమాంటిక్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమాతో పాటు అమైరా.. సంతానం సరసన 'ఓడి ఓడి ఉలైక్కనుం' అనే  సినిమాలో నటిస్తోంది.