Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కాకుండానే హీరోయిన్ ప్రెగ్నెన్సీ.. షాక్ లో అభిమానులు!

బ్రిటీష్ మోడల్, హీరోయిన్ ఎమీజాక్సన్ తల్లి కాబోతుందా..? అంటే అవుననే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. 

Amy Jackson Just Announced Her Pregnancy
Author
Hyderabad, First Published Apr 1, 2019, 12:19 PM IST

బ్రిటీష్ మోడల్, హీరోయిన్ ఎమీజాక్సన్ తల్లి కాబోతుందా..? అంటే అవుననే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. మార్చి 31న బ్రిటన్ లో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఎమీ తను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా ఆమె లండన్ కి చెందిన జార్జ్ పనాయట్టుతో కలిసి డేటింగ్ చేస్తోంది. ఇప్పుడు వారి ప్రేమకి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీనికి సంబంధించి బాబీ బంప్ ఫోటోని షేర్ చేసింది.

'నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన రోజు ఇది. మదర్స్ డేకి మించి ఇంకేదీ లేదు. ఇది కరెక్ట్ టైం అని భావిస్తున్నా.. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించినంతగా దేనినీ 
ప్రేమించలేదు. ఎంతో స్వచ్చమైన నిజాయితీ ఉన్న ప్రేమ ఇది. మన లిటిల్ లిబ్రాని కలవడానికి ఇంక వేచి చూడలేం' అంటూ తన ఆతురతని వ్యక్తపరిచింది.

అయితే పెళ్లి కాకుండా ఆమె తల్లి కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కానీ బ్రిటీష్ కల్చర్ కి ఇది పెద్ద విషయమేమీ కాదు. 

Follow Us:
Download App:
  • android
  • ios