ఎనిమిదో వారం ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసింది. అనారోగ్యంతో నోయల్‌ అర్థాంతరంగా హౌజ్‌ నుంచి వెళ్ళిపోయాడు. శనివారం ఆయనకు హౌజ్‌ గ్రాండ్‌గా సెండాఫ్‌ ఇచ్చింది. అయితే వెళ్ళే క్రమంలో అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌కి భారీగా క్లాస్‌ పీకి హౌజ్‌లో హీట్‌ పెంచారు. ఇక ఆదివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ చాలా సింపుల్‌గానే సాగింది. సండే ఫన్‌గా మార్చాడు నాగ్‌. డాన్స్ లు, ఇమినేషన్‌ టాస్క్ లతో నవ్వులు పూయించి, ఇంటి సభ్యుల్లో జోష్‌ నింపాడు. ఈ క్రమంలో నొప్పి తెలియకుండా ఎలిమినేషన్‌ నుంచి మరో ఇద్దరిని సేవ్‌ చేశారు. ఇద్దరు శనివారంసేవ్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇక ఈ వారం నామినేషన్‌లో ఆదివారం మోనాల్‌, అరియానా సేవ్‌ అయ్యారు. అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌ మిగిలారు. వీరిని కన్‌ఫెషన్‌ రూమ్‌కి పిలిచారు నాగ్‌. వీరిద్దరిలో ఎవరు హౌజ్‌కి కావాలి, ఎవరి అవసరం లేదు అనే టాస్క్ ఇంటి సభ్యులకు నాగార్జున ఇచ్చాడు. సభ్యుల్లో ఆరుగురు అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌, లాస్య, సోహైల్‌, హారిక.. అమ్మా రాజశేఖర్‌ వద్దు అని ఇన్‌ టూ మార్క్ ఇవ్వగా,  అవినాష్‌, అరియానా.. మాస్టార్‌కి సపోర్ట్ చేశారు. ఎక్కువ ఇన్‌ టూ మార్క్ పడ్డ కారణంగా అమ్మా రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అని ప్రకటించాడు నాగ్‌. దీంతో మెహబూబ్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సేవ్‌ అయినందుకు తాను ఆనందంగా లేనని, అమ్మా రాజశేఖర్‌ వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందన్నారు. 

ఇక అన్ని సర్దుకుని అమ్మా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లేందుకు ప్రయత్నించాడు. సభ్యులంతా అమ్మాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినా వినకుండా అమ్మా కోపంగా వెళ్ళిపోతున్నారు. దీంతో నాగ్‌ స్టాప్‌ అన్నారు. ఈ వారం అమ్మా కూడా సేవ్‌ అని చెప్పేశాడు. పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అందుకు కారణం చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఈ వారం నోయల్‌ అనారోగ్యంతో వెళ్ళిపోయాడు. ఆయన పోతూ పోతూ ఈ వారం ఎవరినీ ఎలిమినేట్‌ చేయోద్దని రిక్వెస్ట్  చేశారట. దీంతో తాను, అలాగే బిగ్‌బాస్‌ కూడా కన్విన్స్ అయి ఈ వారం ఎలిమినేషన్‌ రద్దు చేసినట్టు చెప్పారు. సో శనివారం అమ్మాని నోయల్‌ తిడితే తిట్టాడు గానీ గొప్ప పనే చేశాడని అంతా అనుకున్నారు. దీంతో సేవ్‌ అయిన అమ్మా మొత్తానికి నక్క తోక తొక్కాడనే చెప్పొచ్చు.  అంతేకాదు నెక్ట్స్ వీక్‌కి డైరెక్టర్‌గా కెప్టెన్‌కి ఎంపికయ్యారు.