టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు పూరి. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ 'బాక్సర్' గా కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పూరి తెరకెక్కించనున్న ఈ సినిమా 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాకి సీక్వెల్ అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' చిత్రం 2003లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకొంది.

ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం పూరి రాసుకున్న లైన్ ఆ సినిమాకు సిమిలర్ గా ఉందని టాక్. అయితే బాక్సింగ్ సన్నివేశాలు మరింత ఇంటెన్సిటీతో చూపించబోతున్నారట. విజయ్ దేవరకొండని తెరపై మాసివ్ గా చూపించడానికి ఈ కథను ఎన్నుకున్నాడని చెబుతున్నారు.

రవితేజకైతే  'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' భారీ సక్సెస్ ఇచ్చింది. మరి విజయ్ దేవరకొండకి ఈ బాక్సింగ్ నేపధ్యం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ప్రస్తుతం విజయ్.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన తరువాత పూరి సినిమాను సెట్స్ పైకి  తీసుకువెళ్లనున్నాడు.