రిషి సునాక్ కు కాస్త కొత్తగా అభినందనలు తెలిపిన అమితాబ్, బిగ్ బి కి వంతపాడుతున్న నెటిజన్లు

దాదాపు 200 ఏళ్లు మన భారతీయులను ఏలిన బ్రిటీష్ వారికి.. మొట్ట మొదటి సారి ఒక ఇండియన్ అయిన రిషి సునాక్  ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇండియాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. 

Amitabh Special congrats To Rishi Sunak

దాదాపు 200 ఏళ్లు మన భారతీయులను ఏలిన బ్రిటీష్ వారికి.. మొట్ట మొదటి సారి ఒక ఇండియన్ అయిన రిషి సునాక్  ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇండియాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. 

దివాళి సందర్భంగా భారతీయులకు తీపి కబురు అందింది. జీవితాంతం మరిచిపోలేని శుభవార్త వినిపించింది. భారత సంతతికి చెందిన వ్యాక్తి రిషి సునక్‌ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎన్నో ఏళ్ళు మన ఇండియాను పాలించిన వారికి పాలకుడిగా ఒక ఇండియన్ ఎన్నికయ్యాడు. అంతే కాదు  బ్రిటన్‌లో శ్వేతజాతీయేతర వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికవడం ఇదే తొలిసారి.  ఈ విషయంలో కూడా సునాక్ రికార్డ్ సృష్టించాడు. 

రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రిషిని అభినందిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. ఈ విషయంలో తనదైన స్టైల్లో స్పందించారు ఇండియాన్ మెగాస్టార్ .. బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్. అందరికంటే కాస్త  భిన్నంగా రిషికి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా నిలిచారు అమితాబ్ 

 

ఈ విధంగా అమితాబ్ స్పందించారు. రిషి సునక్ ప్రధాని కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తాను రాసిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో అమితాబ్‌ షేర్‌ చేశారు. భారత్ మాతా కీ జై. ఇప్పుడు బ్రిటన్‌ కొత్త వైస్రాయ్‌ను ప్రధానమంత్రిగా కలిగి ఉన్నది’ అని ట్విట్టర్‌లో రిషి సునక్‌ను అభినందిస్తూ అమితాబ్‌ రాశారు. దీనికి అర్ధం ఏంటీ అంటే..?  200 ఏళ్ళు భారత్‌ను పాలించిన తర్వాత 1947లో బ్రిటన్‌కు వెళ్తూ వెళ్తూ మన దేశంలో వైస్రాయ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఉటంకించారు అమితాబ్. 

ఇక ఈ  పోస్ట్‌లో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకున్న వారు ఈ పోస్ట్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు. 200 ఏండ్ల బానిసత్వం నేడు ప్రతీకారం తీర్చుకున్నదని ఓ నెటిజెన్‌ కామెంట్‌ చేశాడు. మరికొంత మంది మాత్రం ఇది పెద్ద విషయం కాదన్నట్టు స్పందిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం తాము ఈ విషయంలో గర్విస్తున్నట్టు తెలిపారు. అమితాబ్ ఇలా డిఫరెంట్ గా పోస్ట్ లు పెట్టడం కామన్ గా జరిగేదే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios