అమితాబ్ తొలిసారిగా మందు కొట్టే సీన్‌లో నటించిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 1975లో రూపొందిన మిలి సినిమాలో తొలిసారిగా అమితాబ్ బచ్చన్ డ్రింకింగ్ సీన్‌లో నటించాడు. ఆ సినిమాలో అమితాబ్‌కు జోడిగా ఆయన భార్య జయ బచ్చన్ నటించటం విశేషం.
కరోనా లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలకు చాలా ఖాళీ సమయం దొరికింది. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో సినీ తారలు ఇళ్లకే పరమితమయ్యారు. దీంతో గతంలో చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు స్టార్స్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఆ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నాడు బిగ్ బీ.
తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు అమితాబ్. తాను తొలిసారిగా మందు కొట్టే సీన్‌లో నటించిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 1975లో రూపొందిన మిలి సినిమాలో తొలిసారిగా అమితాబ్ బచ్చన్ డ్రింకింగ్ సీన్‌లో నటించాడు. ఆ సినిమాలో అమితాబ్‌కు జోడిగా ఆయన భార్య జయ బచ్చన్ నటించటం విశేషం. ఘన విజయం సాధించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి.
ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ ఓ అద్భుతమైన ఆర్ట్ వర్క్ పోస్టర్‌ను షేర్ చేశాడు అమితాబ్. ఆ ఫోటోతో పాటు `మిలి సినిమా.. జయ నేను, నా తొలి డ్రంక్ సీన్. అమర్ అక్బర్ ఆంటోని, సత్తేపే సత్తా, హమ్ ఆర్ శక్తి సినిమాలోని సన్నివేశాల కన్నా చాలా ముందు` అంటూ ట్వీట్ చేశా అమితాబ్. మిలి సినిమాకు బిమాల్ దత్, మెహిని సిప్పి కథ అందించగా హరిషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
