బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం అందుకున్న 'కాంచన' చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.

ఈ సినిమాకి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుండి. ఈ సినిమాలో అక్షయ్ కి జోడీగా కియారా అద్వానీ నటించనుంది.

అయితే 'కాంచన' సినిమాలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీమేక్ లో ఆ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన లేదు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.