Asianet News TeluguAsianet News Telugu

Manike Mage Hithe: ఇంటర్నెట్ సెన్సేషనల్ సాంగ్‌కు సెలెబ్రిటీల స్టెప్పులు అదుర్స్

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మనికే మగే హితే శ్రీలంక సాంగ్‌కు అమితాబ్ బచ్చన్ స్టెప్పులు నెటిజన్లను కట్టిపడేస్తున్నది. పాత చిత్ర కాలియా నుంచి క్లిప్‌ను ఈ పాటకు జతచేసి బిగ్ బీ పోస్టు చేశారు. ఈ పాటకు ఆయన స్టెప్పులు సరిగ్గా సింక్ కావడంతో రియాక్షన్స్ క్రేజీగా వచ్చేస్తున్నాయంతే.
 

Amitabh Bachchan grooves to Manike Mage Hithe song a hit on social media
Author
New Delhi, First Published Sep 9, 2021, 3:13 PM IST

ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా మనికే మగే హితే సాంగ్ హల్‌చల్ చేస్తున్నది. ఇన్‌స్టాలో తమ రీల్స్‌కు ఈ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకుని పోస్టులు చేస్తున్నారు. తమకు తోచిన స్టెప్పులు వేస్తూ పాటపై ప్రేమను పంచుకుంటున్నారు. కామన్ నెటిజన్ నుంచి సెలెబ్రిటీల వరకూ అందరి మదినీ ఈ సింహళ పాట గెలుచుకుంది. దీంతో బిగ్ బీ మొదలు మాధురి దీక్షిత్, టైగర్ ష్రాఫ్, ఇంకా మరెందరో సెలెబ్రిటీలు తమ వెర్షన్ వీడియోనూ అప్‌లోడ్ చేసి అభిమానులకు కనువిందు చేస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ వయసు పెరుగుతున్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ చెంతనే ఉంటారు. తన వీడియోలు, అప్‌డేట్లు, తన గత సినిమాల క్లిప్‌లనూ షేర్ చేస్తూ ట్రెండ్ ఫాలో అవుతుంటారు. గతనెల ‘కాలియా’ సినిమాలోని ఓ క్లిప్‌ను ‘జహా తెరి యే నజర్ హై’ పాటను జోడించగా తాజాగా, ఇంటర్నెట్ సెన్సేషనల్ సాంగ్ మనికే మగే హితే పాటను అదే వీడియోకు జోడించి పోస్టు చేశారు. ఆ పాటకు కాలియా పాటలోని స్టెప్పులు పర్‌ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. దీంతో బిగ్ బీ పోస్టు సోషల్ మీడియాలో హిట్ అయింది.

 

టైగర్ ష్రాఫ్ కూడా మనికే మగే హితే సాంగ్‌తో లవ్‌లో ఉన్నారు. దాన్ని ఆయన తన ఇన్‌స్టా అకౌంట్‌తో బయటపెట్టారు. కొరియోగ్రాఫర్ పరేశ్ ప్రభాకర్ శిరోద్కర్‌తో కలిసి ఓ డ్యాన్స్ సీక్వెన్స్‌ను పాటకు జోడించి పోస్ట్ చేశారు.

 

మాధురి దీక్షిత్ కూడా ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ పాటను అనుసరిస్తూ కదులుతూ పాటపై ఇష్టాన్ని పంచుకున్నారు. వీడియో పోస్టు చేసి తాను ఈ పాటను లవ్ చేస్తున్నట్టు రాసుకొచ్చారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హిట్ అయింది.

 

సెలెబ్రిటీలే కాకుండా ఈ పాటకు డ్యాన్స్ చేసి సామాన్యులూ ఫేమస్ అయిపోతున్నారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఖాళీ విమానంలో ఈ పాటకు డ్యాన్స్ చేసి పోస్టు చేసిన వీడియో ఆమెను ఒకేసారి లక్షల మందికి చేరువచేసింది.

 

ఈ పాట పాడి ఓవర్‌నైట్‌లో స్టార్ ఫేమ్ సంపాదించుకున్నారు శ్రీలంక సింగర్ యొహాని డిసిల్వా. ఆమె స్వీట్ వాయిస్ నెటిజన్లను కట్టిపడేస్తున్నది. నిజానికి ఈ పాట ఏడాది క్రితమే శ్రీలంక సింగర్ సతీశన్ పాడారు. దీన్ని 2020లోనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. కానీ, అనుకున్నంత పాపులారిటీ రాలేదు. యొహాని ఈ పాటను మరోసారి పాడి హిట్ చేశారు. ఇప్పుడు యొహానితోపాటు ఒరిజినల్ వర్షన్ కూడా ఆదరణ పొందుతున్నది. అంతేకాదు, పలుభాషల్లో ఈ పాటకు సరికొత్ వర్షన్‌లు రావడం పాట పాపులారిటీని తెలియజేస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios