ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 50 ఏళ్ల అనుభవం ఉన్న అతికొద్ది నటీనటులల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటనలో ఎప్పటికి నాట్ అవుట్ అనే టాక్ తెచ్చుకున్నారు. ఇకపోతే వయసుకు తగ్గట్టుగా మంచి పాత్రలను చేస్తున్న అమితాబ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ను ఒకసారి నెమరువేసుకున్నారు. 

అది కూడా షారుక్ ఖాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ ఆప్యాయంగా వివరించడం అభిమానులను ఆకట్టుకుంది. తాప్సి అమితాబ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ‌ద్లా సినిమాను షారుక్ నిర్మించారు. అయితే ప్రమోషన్ లో భాగంగా అమితాబ్ ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి షారుక్ కొన్ని విషయాలు బయటకు లాగారు. 

అమితాబ్ మొదటి పారితోషికం గురించి కూడా వివరించారు. 1969 ఫిబ్రవరి 15న మొదటి అవకాశం వచ్చిందని అప్పుడు  ‘సాత్‌ హిందుస్తానీ’ అనే సినిమాకు  సంతకం చేసి రూ.5000 పారితోషికాన్ని అందుకున్నట్లు అమితాబ్ తెలియజేశారు. అలాగే కెరీర్ మొదట్లో అలహాబాద్ నుంచి బాలీవుడ్ కి ఏ విధంగా అడుగులు పడ్డాయి అనే విషయాన్నీ కూడా అమితాబ్ షారుక్ ద్వారా జనాలకు తెలియజేశారు.