స్నేహితుడికి బిగ్‌బీ భావోద్వేగ సంతాపం.. కన్నీళ్ళు పెట్టిస్తున్న ఫోటో!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేరనే విషయం తెలిసి దుఖసాగరంలో ముగినిపోయాడు. ఓ వైపు కరోనా పాజిటివ్‌తో కోలుకుంటున్న ఆయన తన స్నేహితుడు లేడనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సంతాపం తెలిపారు.
ప్రముఖ రాజకీయ వేత్త, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ మరణంతో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేరనే విషయం తెలిసి దుఖసాగరంలో ముగినిపోయాడు. ఓ వైపు కరోనా పాజిటివ్‌తో కోలుకుంటున్న ఆయన తన స్నేహితుడు లేడనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సంతాపం తెలిపారు. తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ అందులో ఏం మెన్షన్ చేయలేదు. మౌనంగా తన తల వంచి ఉన్న ఫోటోతోనే తన భావోద్వేగ సంతాపాన్ని తెలియజేశారు.
ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, నేను దుఖంతో మునిగిపోయాను. చాలా బాధపడుతున్నాను. నా తల వంగి ఉంది. ప్రార్థనలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నా హృదయానికి ఎంతో దగ్గరైన ఆత్మ నన్ను శాశ్వతంగా వదిలి వెళ్లిపోయింది` అని అమితాబ్ ఎమోషనల్‌గా రాసుకున్నారు.
అమితాబ్ బచ్చన్ కుటుంబానికి, అమర్ సింగ్‌కి ఎంతో దగ్గరి అనుబంధం ఉంది. అమితాబ్ భార్య, నటి జయ బచ్చన్‌ని రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకమైనది. ఆయనే దగ్గరుండి ఆమెకి రాజకీయ పాఠాలు నేర్పించారు. అమర్ సింగ్‌ని ఆమె అన్నయ్య అని పిలుస్తుంటారు. సమాజ్ వాది పార్జీ నుంచి అమర్‌ని బహిష్కరించిన తర్వాత వీరి మధ్య దూరం పెరిగింది.
ఇదిలా ఉంటే జయ బచ్చన్ రాజకీయాలకు సరిపడరనే విషయాన్ని కూడా అమర్ సింగ్ తేల్చి చెప్పారు. ఓ సందర్భంలో ఈ విషయాన్నిబహిరంగంగానే వెల్లడించారు. `ఆమె మాస్ లీడర్ కాదు. ప్రజలను ఇష్టపడదు. ఫోటోలు తీస్తుంటే కెమెరాని లాక్కుంటారు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వారిని దూరం పెట్టండని చెబుతుంది`ని అని సంచలన కామెంట్ చేశారు. అయితే ఆ తర్వాత దీనిపై ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. కానీ అమితాబ్ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక అమర్ సింగ్ గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాదపడుతున్నారు. కొన్ని రోజులుగా సింగపూర్‌లో చికిత్స పొందుతున్న ఆయన చివరకు శనివారం తుది శ్వాస విడిచారు. రాజకీయాలకు అతీతంగా అజాతశత్రువుగా ఉండే అమర్ సింగ్ మరణంతో దేశ ప్రధాని నరేంద్రమోడీతోపాటు వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరోవైపు అమితాబ్ ఫ్యామిలీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిప్పుడు ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు.