ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పై వరుసగా సినీ తారలు స్పందిస్తున్నారు. ఇంగ్లాండ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మ్యాచ్ లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీనితో క్రికెట్ అభిమానుల్లో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. కనీసం ఏ కాలంలో ఎక్కడ మ్యాచ్ లు నిర్వహించాలో కూడా తెలియని స్థితిలో ఐసీసీ ఉందని అభిమానులు అంటున్నారు. 

అలాంటి ఐసీసీ ధోని ధరించిన గ్లవ్స్ పై రాద్ధాంతం చేస్తోంది. ShameOnICC పేరుతో అభిమానులు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంగ్లాడ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ లని వెంటనే ఇండియాకు మార్చాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరదాగా డిమాండ్ చేశారు. వరల్డ్ కప్ వేదికని ఇండియాకు మార్చండి. తద్వారా వరుణ దేవుడు కూడా ఇండియాకు వస్తాడు. మా ప్రజలకు నీటి ఎద్దడి కష్టాలు కాస్తయినా తగ్గుతాయి అంటూ అమితాబ్ చమత్కరించారు. 

కివీస్, ఇండియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం ఇక్కడ కాకుండా కరువుతో అల్లాడుతున్న తమ రాష్ట్రం మహారాష్ట్రలో కురవాలని కోరాడు.