సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. తనకు సబంధించిన విషయాలతో పాటు.. సమాజానికి సబంధించిన విషయాలలో కూడా స్పందిస్తుంటాడు. తాజాగా అమితాబ్.. చంద్రమండలంపై చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. అంతే కాదు ఎలన్ మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్ బీ.
80 దాటి వయస్సు పరుగులు పెడుతున్నా.. నవ యువకుడిలా.. ఇంకా పని చేస్తూనే ఉన్నాడు బిగ్ బీ అమితాబ్. తన ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను అంటున్నాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. సమాజానికి సబంధించిన విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన అమెరికన్ వ్యాప్తార వేత్త ఎలాన్ మస్క్ గురించి స్పందించాడు.
మెగా స్టార్ అమితాబచ్చన్ ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ను ప్రశంసించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. సోనీ టీవీలో కౌన్ బనేగా కరోడ్ పతి 15వ ఎపిసోడ్ ఈ నెల 4న ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో పంజాబ్ లోని పఠాన్ కోట్ కు చెందిన అపూర్వ మెహతా విజేతగా నిలిచి, అమితాబ్ ముందు కూర్చోగా.. 3,20,000 బహుమతిని గెలుచుకున్నారు.
రెండో రౌండ్ లో పంజాబ్ కే చెందిన జస్ కరణ్ సింగ్ అనే బీఎస్సీ విద్యార్థి ఎంపికయ్యాడు. జస్ కరణ్ తాను ఎదుర్కొన్న అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ గురించి అమితాబ్ ప్రస్తావన చేశారు. ఎలాన్ మస్క్ అపురూపమైన వ్యక్తి. కొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఇక అతని తరువాతి ఆవిష్కరణ అంతరిక్షంలో ఉంటుందని, మనమంతా అక్కడ ఉంటామని నమ్మేలా చేశాడు.
ప్రస్తుత పరిశోధనలు చూస్తుంటే అది త్వరలోనే సాకారం అయ్యేలా కనిపిస్తుంది. ఇక అదే జరిగి.. అనుకున్నది జరిగితే.. వెంటనే చంద్రుడిపైనా కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నిర్వహించే రోజు వస్తుంది అని అమితాబ్ పేర్కొన్నారు. ఇక కెబిసి విషయానికి వస్తే.. నెక్ట్స్ ఎపిసోడ్ లో జస్ కరణ్ కోటి గెలుచుకునే ప్రశ్నను ఎదుర్కోనున్నాడు. ఇక వీటితో పాటు అమితాబ్ మరో ట్వీట్ ద్వారా ఆడియన్స్ ను ఆకర్షించాడు.
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ భారత్ మాతాకీ జై అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.
