బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌ అయ్యారు. రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఇటీవల తనని కలిసి వారు కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పారు. 

ఇదిలా ఉంటే కియారా అద్వానీ టెస్ట్ కి వెళ్తున్నారు. అమీర్‌ ఖాన్‌తో కలిసి ఇటీవల కియారా అద్వానీ ఓ కమర్షియల్‌ యాడ్‌ చేశారు. దీనికి నితేష్‌ తివారి డైరెక్షన్‌ చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరు కలిశారు. దీంతో కియారా కూడా టెస్ట్ కి వెళ్లారు. ఆమె ఫలితం రావాల్సి ఉంది. అలాగే నితేష్‌ తివారి సైతం టెస్ట్ చేయించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ఆందోళన నెలకొంది. అసలే వైరస్‌ విజృంభిస్తున్న వేళ టాప్‌ స్టార్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETimes (@etimes)

ఇదిలా ఉంటే కియారా ఇప్పటికే ఓ సారి టెస్ట్ చేయించుకుంది. ఆమె నటిస్తున్న `భూల్‌ భులైయ్యా 2` చిత్ర హీరో కార్తిక్‌ అర్యాన్‌కి కరోనా సోకింది. దీంతో తనకు కూడా సోకిందేమో అని ఆమె టెస్ట్ చేయించుకోగా, నెగటివ్‌ అని తేలింది. ఇప్పుడు మరోసారి ఆమె టెస్ట్ కి వెళ్లడం విశేషం.