`అంబాజీపేట మ్యారేజి బ్యాండు` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంత వచ్చాయంటే?

సుహాస్‌ హీరోగా నటించిన `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మౌత్‌ పబ్లిసిటీ దీనికి మరింతగా కలిసి వస్తుంది. దీంతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది.

ambajipeta marriage band movie two days collections arj

కంటెంట్‌ బాగుంటే కాస్టింగ్‌తో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగు ఆడియెన్స్. అందుకు నిదర్శమనే మొన్న వచ్చిన `హనుమాన్‌`. అంతకు ముందు వచ్చిన `బేబీ`. ఇప్పుడు అలాంటిదే `అంబాజీపేట మ్యారేజి బ్యాండు`. సుహాస్‌ హీరోగా నటించిన మూవీ ఇది. దుశ్యంత్‌ దర్శకత్వం వహించారు. తెలుగమ్మాయి శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. `పుష్ప` జగదీష్‌, శరణ్‌ ప్రదీప్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి విశేష స్పందన లభించింది. ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ తోనే సత్తా చాటింది. 

ఇప్పుడు ఈ మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు రెండున్నర కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండో రోజు కాస్త పెరిగాయి. రెండు రోజుల్లో ఈ మూవీ రూ.5.16కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం విశేషం. సాధారణంగా రెండో రోజు కలెక్షన్లు తగ్గుతాయి. కానీ పెరగడం విశేషం. అది సినిమా జనాల్లోకి వెళ్తుందనే సందేశాన్ని ఇస్తుంది. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్‌ అనేది ఆడియెన్స్ లోకి వెళ్తుందని అర్థమవుతుంది. దీంతో మూడో రోజు(ఆదివారం) ఈ మూవీకి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రోజు చాలా చోట్ల హౌజ్‌ ఫుల్‌ బోర్డులు పడుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. సినిమా మున్ముందు పెద్దరేంజ్‌కి వెళ్లబోతుందని చెప్పొచ్చు. 

సినిమా కథ విషయానికి వస్తే.. అంబాజీపేట విలేజ్‌లో సుహాస్‌, శరణ్య కవలలు. సుహాస్‌ మ్యారేజీ బ్యాండ్‌ వాయిస్తుంటాడు. శరణ్య స్కూల్‌ టీచర్‌గా చేస్తున్నారు. ఊర్లో పెద్దింటికి చెందిన నితిన్‌ ఫ్యామిలీ వీరిని తక్కువగా చూస్తుంటారు. అవమానిస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలవుతుంటాయి. అది పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్తుంది. దీంతో శరణ్యని బట్టలూడదీసి అవమానిస్తాడు విలన్‌. దీంతో సుహాస్‌ విలన్‌ పైకి వెళ్తారు. వాళ్ల మనసులంతా కలిసి సుహాస్‌ని కొట్టి గుండు గీయిస్తాడు. దీంతో వీరి ఫ్యామిలీ న్యాయం కోసం విలన్‌ ఇంటిముందు ధర్నాకి దిగుతారు. మరోవైపు సుహాస్‌.. ఆ విలన్‌ చెల్లిని ప్రేమిస్తాడు. ఆ విషయం అతనికి తెలుస్తుంది. వీరి ప్రేమని ఎలా బ్రేక్‌ చేశాడు, సుహాస్‌, శరణ్‌ లకు న్యాయం జరిగిందా ? చివరికి ఎలాంటి ముగింపు చోటు చేసుకుంది అనేది మిగిలిన కథ. 

ఇందులో సుహాస్‌ చాలా నేచురల్‌గా చేశాడు. మరోవైపు శరణ్య చాలా బాగా చేసింది. ఆమె పాత్రకి మంచి పేరు వస్తుంది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. కొత్త అమ్మాయి అయిన శివానీ చాలా బాగా నటించింది. విలేజ్‌ గర్ల్ గా బాగా సూట్‌ అయ్యింది. మలయాళ నటుడు నితిన్‌ అదరగొట్టాడు. ఆర్టిస్టులు సినిమాకి పెద్ద ప్లస్‌. మ్యూజిక్‌ కొత్తగా ఉంది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios