మాధవన్‌ లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన సూపర్‌ హిట్ వెబ్‌ సిరీస్‌ బ్రీత్. కొడుకు ప్రాణాలు కాపాడేందుకు హత్యలు చేసే తండ్రి పాత్రలో మాధవన్‌ అద్బుతంగా నటించాడు. తొలి సీజన్‌ సూపర్‌ హిట్ కావటంతో రెండో సీజన్‌ ను రూపొందించారు. సీజన్‌ 2 లీడ్‌ రోల్‌లో అభిషేక్‌ బచ్చన్‌ నటించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో క్యారెక్టర్స్‌ లుక్‌ను రివీల్‌ చేసిన మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సిరీస్‌లో అభిషేక్.. అవినాష్‌ సబర్వాల్‌ పాత్రలో నటిస్తుండగా నిత్యా మీనన్ ఆయన భార్య అబాగా కనిపించనుంది. ఇప్పటికే రెండు టీజర్‌లు రిలీజ్ చేసిన మేకర్స్ జూలై 1న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అభిషేక్‌, నిత్యలు తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండటంతో ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్రీత్‌ ఇన్‌ టు ద షాడోస్‌ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ దాదాపు 200 దేశాల్లో ఒకేసారి అమెజాన్‌ ఒరిజినల్స్‌ ద్వారా విడుదల కానుంది. 

క్లైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ షో జూలై 10న విడుదల కానుంది. సయామీ ఖేర్‌, అమిత్‌ సాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  భవానీ ఐయ్యర్‌, విక్రమ్ తులి, అర్షద్‌ సయ్యద్‌ మయాంక్‌ శర్మలు అందించిన కథను మయాంక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందించారు. అబుడాంటియా ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ షోతో అభిషేక్‌ బచ్చన్‌ డిజిటల్‌ఎంట్రీ ఇస్తున్నాడు.