Asianet News TeluguAsianet News Telugu

'అమెజాన్ ప్రైమ్' లో సినిమా వేస్తే నిర్మాతకు ఎంతొస్తుందంటే...

అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్లలో ఆదరణ ఎక్కువ ఉంది. గ్రామీణ ప్రాంతంలో వాళ్లు సైతం కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమా నిర్మాతలంతా అమెజాన్ ప్రైమ్ దగ్గర క్యూ కడుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఏ ప్రాతిపదికన ..నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ పే చేస్తోంది అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

Amazon Prime Pay-per-view price for content uploaders
Author
Hyderabad, First Published Apr 18, 2020, 10:52 AM IST

లాక్‌ డౌన్ సెగ అన్నింటికీ త‌గిలిన‌ట్లే సినిమాల‌కూ త‌గిలిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద సినిమాల సంగతి ప్రక్కన పెడితే ప్ర‌స్తుతం చిన్న సినిమాల‌కు ఓటీటీ ఓ మంచి రెవిన్యూ జనరేటర్ లా క‌నిపిస్తోంది. అమెజాన్‌, హాట్‌స్టార్ వంటి ఓటీటీల‌పై సినిమాల‌ను స్ట్రీమింగ్‌కు ఉంచితే లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్కువ మంది చూసే అవ‌కాశం ఉండటంతో కలిసి వస్తోంది. దీంతో ఓటీటీ చిన్న నిర్మాత‌ల‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం భారీగా కనిపిస్తోంది అని అంచనా వేస్తున్నారు. 

అయితే ఆ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్లలో ఆదరణ ఎక్కువ ఉంది. గ్రామీణ ప్రాంతంలో వాళ్లు సైతం కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమా నిర్మాతలంతా అమెజాన్ ప్రైమ్ దగ్గర క్యూ కడుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఏ ప్రాతిపదికన ..నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ పే చేస్తోంది అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు .. ఎంత ఎక్కువ మంది అమెజాన్ ప్రైమ్ లో అప్ లోడ్ చేసిన తమ సినిమాని చూస్తే అంత ఎక్కువ‌గా నిర్మాత‌ల‌కు డ‌బ్బులువ‌చ్చే అవ‌కాశం ఉటుంది. అంటే వ్యూస్ ని బట్టే రేటు ఉంటుందన్నమాట. పే ఫర్ వ్యూ అనే స్కీమ్ ని ఫాలో అవుతూ రేట్ ఫిక్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. కొత్త సినిమాలు లేదా కొత్త కంటెంట్ అయితే గంటలు 3 రూపాయలు, అదే పాత సినిమాలు లేదా పాత కంటెంట్ అయితే గంటకు రెండు రూపాయలు పే చేస్తున్నారు.

 దాంతో బయిట ఓ మాదిరిగా ఆడిన పలాస, ఓ పిట్ట కథ, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి, తూటా, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలన్నీ ఈ లాక్ డౌన్ కాలంలోనే ఒక్కొక్కళ్లు యాభై లక్షలు దాకా సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు చిన్న‌ సినిమాల నిర్మాతలు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు సంపాదిస్తున్నట్లు స‌మాచారం. ఇక డైరక్ట్ గా థియోటర్ లో రిలీజ్ కాని శక్తి, షూట్ ఎట్ సైట్ వంటి సినిమాలకు సైతం బాగానే కలిసి వస్తోంది.  ఈ మద్య కాలంలో అమెజాన్‌ కూడా టీవీల్లో భారీగా యాడ్స్‌ ఇస్తున్న‌ది.

 లాక్‌డౌన్ కార‌ణంగా అనేక‌మంది ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ను ఎంచుకుంటున్నారు. అయితే మే 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఆ రేటు ని తగ్గించబోతోంది. కొత్త కంటెంట్ కు 2.50 ,పాత కంటెంట్ కు 1.50 చొప్పున పే చేయాలని నిర్ణయించుకుంది. ఎక్కువ మంది అమెజాన్ ప్రైమ్ లో తమ సినిమా అప్ లోడ్ చేస్తామంటూ తిరుగుతూండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో గంటకు ఐదు రూపాయలు పే చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడా రోజులు పోయాయి. అందరికీ అమెజాన్ ప్రైమే దిక్కుగా మారింది. అందుకే వాళ్లదే డిమాండ్ అని చెప్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios